12జీబీ ర్యామ్, 1టీబీ మెమరీ, 20 మెగా పిక్సెల్ కెమెరా.. సంచలనానికి తెర తీసిన సరికొత్త స్మార్ట్ ఫోన్!

Turing phone Cadenza creates sensation

06:31 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Turing phone Cadenza creates sensation

ప్రపంచం మొత్తం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఖరీదైన ఐఫోన్ నుండి అతి తక్కువ ఫ్రీడమ్ 251 వరకు కొన్ని వేల రకాల స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లో దొరుకుతున్నాయి. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే స్మార్ట్ ఫోన్ వీటన్నికి మించినది. ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి పోటిపడుతున్న ఐఫోన్, సామ్-సంగ్ లాంటి కంపెనీలను కూడా వెనక్కు నెట్టే సామర్ధ్యం ఉన్న ఈ ఫోన్ ను ట్యూరింగ్ రోబోటిక్స్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్ పేరు ట్యూరింగ్ ఫోన్ క్యాడెంజా(Cadenza). ఈ ఫోన్ ను వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్ణయించారు.

ఫోన్ విడుదలకు సిద్ధమైన సంగతి ఓకే... కానీ ఐఫోన్ లాంటి పెద్ద కంపెనీని.. కొత్తగా విడుదలవుతున్న ఈ ఫోన్ వెనక్కి నెట్టగలదా అనే సందేహం మీలో వచ్చి ఉండచ్చు. ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్సే ఇందుకు కారణమవ్వనున్నాయి. ఇప్పటివరకు మార్కెట్ లో విడుదలైనా ఏ ఫోన్ లో కూడా ఇంత అధ్బుతమైన ఫీచర్స్ లేవనే చెప్పాలి.

1/2 Pages

ట్యూరింగ్ ఫోన్ క్యాడెంజా ఫీచర్స్:

కలర్స్ - సిల్వర్ అండ్ గ్రే.

డిస్ ప్లే - 5.8 ఇంచెస్ ఐపిఎస్ ఎల్సిడి డిస్ ప్లే, క్వాడ్ హెచ్ డి(2560x1440 పిక్స్) రెసొల్యూషన్, 506 పిపిఐ పిక్సెల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5.

ర్యామ్ - 12 జీబీ

స్టోరేజ్ - 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 2x 256 జీబీ ఎక్సటర్నల్ స్టోరేజ్.

కెమెరా - 60 మెగా పిక్సెల్ ఐమాక్స్ 4కె క్వాడ్ రేర్ కెమెరా, డ్యూయల్ 20 మెగా పిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా.

బ్యాటరీ - 100Wh బాటరీ (2400 mAH గ్రఫీనే సూపర్ కెపాసిటర్ బ్యాటరీ), 1600 mAH ఎల్ఐ-అయోన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్.

English summary

Turing phone Cadenza creates sensation