టర్కీ ప్రెసిడెంట్ వైఫ్ జల్సా లైఫ్ గురించే తెలిస్తే మతి పోవాల్సిందే!

Turkey presidents wife luxurious wife

12:26 PM ON 20th July, 2016 By Mirchi Vilas

Turkey presidents wife luxurious wife

లగ్జరీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం... జమిందారి కుటుంబాల్లో చూస్తుంటాం... కానీ, టర్కీ అధ్యక్షుడు రిసెప్ ఎర్డోగన్ సంపద చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. దేశవ్యాప్తంగా 139 మిలియన్ పౌండ్ల ఖరీదైన అతి విలాసవంతమైన బంగళాలు, ప్యాలస్ లు, విల్లాలు ఈయనకున్నాయి. ఇక విదేశాల్లో కోట్ల కొద్దీ కరెన్సీ, బంగారం మూలుగుతోంది. అతని భార్య ఎమిన్ అయితే తనకు నచ్చిన వస్తువులను సొంతం చేసుకోవడానికి డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు చేస్తుందట. ముస్లిం మతాచారాలను పాటిస్తున్నా సరే, ఆమె విలాసాలు, షాపింగ్ సరదాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి.

టర్కీలో సుమారు 20 లక్షల జనాభాలో చాలామంది రోజుకు కేవలం 3 పౌండ్ల సొమ్ముతో బతుకీడుస్తుంటే, ఈమె పటాటోపం మాత్రం హద్దులు దాటివుంటుంది. ఇక విదేశాలకు వెళ్లినప్పుడు షాపింగ్ చేస్తే షాకవ్వాల్సిందే. అతి ఖరీదైన కళా ఖండాలను ఎంత సొమ్ము పెట్టి అయినా కోనేస్తుంది. ఇక ఆమె బాత్ రూమ్ లోని రోల్ సిల్క్ వాల్ పేపర్ ని 2 వేల పౌండ్ల ఖరీదు చేస్తుందట. బ్రసెల్స్ లో ఓ షాపింగ్ మాల్ లో ఎమిన్ తనకు నచ్చిన వస్తువులు కొనుక్కునేందుకు ఏకంగా ఆ మాల్ నే కాసేపు మూసి వేయించిందట. కిలో 1500 పౌండ్ల ఖరీదు చేసే వైట్ టీ ని ఈమె బంగారు తాపడం చేసిన గ్లాసుల్లో తాగుతుందట.

ఆ గ్లాస్ ఒక్కొక్కటి 250 పౌండ్ల విలువ చేస్తుందని అంటారు. ఓ సారి వార్సాలో తన భర్తతో కలిసి అఫిషియల్ విజిట్ చేసినప్పుడు ప్రాచీన కళా ఖండాలను అమ్మే బజార్ నే కొనేసినంత పని చేసిందట. అక్కడ 37 వేల పౌండ్ల విలువైన వస్తువులను కొని తన ప్యాలస్ కు తెచ్చి వాటిని అలంకరించిందట. ఇక రాజధాని అంకారాలో ఈ జంటకున్న 500 మిలియన్ పౌండ్ల ఖరీదైన భవనం 1.6 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో దేవేంద్ర భవనంలా ఉంటుంది. వంద గదులున్న ఈ ప్యాలస్ లో 400 భారీ తలుపులు ఉంటాయి. గెస్టుల కోసం అతి విశాలమైన భవనాలు, హాళ్ళూ, రాజ మందిరాలను తలపిస్తుంటాయి.

ఒకప్పుడు ఇరాకీ నియంత సద్దాం హుసేన్ కన్నా, ఎక్కువగా సంపద మీద ఈ భార్యాభర్తలకున్న ఆశ అంతా ఇంతా కాదని విమర్శకులు అంటున్నా, వీళ్ళు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు.

1/8 Pages

English summary

Turkey presidents wife luxurious wife