టర్కీలో తిరగబడ్డ సైనికులు: 42 మంది మృతి

Turkey soldiers attack on turkey people

12:11 PM ON 16th July, 2016 By Mirchi Vilas

Turkey soldiers attack on turkey people

మొన్నటికి మొన్న టర్కీలో ఉగ్రవాదుల దాడులు జరిగి, ఇంకా కోలుకొని స్థితిలో ఉంటే, ఇప్పుడు ఏకంగా సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సైన్యంలోని ఓ వర్గం టర్కీలో తిరుగుబాటుకు యత్నించింది. దీంతో టర్కీ రణరంగాన్ని తలపిస్తోంది. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సైన్యం ప్రకటించినా, ఆతర్వాత కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు టర్కీ ప్రధాని ప్రకటించడం విశేషం. అంతేకాదు, దేశ వ్యాప్తంగా మార్షల్ చట్టం, కర్ఫ్యూ విధించారు. రాజధాని అంకారా గగనతలంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి.

1/6 Pages

ఇస్తాంబుల్, అంకారా తదితర ప్రధాన పట్టణాల్లో సైనిక ట్యాంకులు తిరిగాయి. పార్లమెంట్ భవనం సమీపంలోని పలు కీలక ప్రాంతాల్లో సైన్యం పేలుళ్లకు పాల్పనట్లు అక్కడి మీడియా ప్రకటించింది. నిరంకుశ పాలన, పెరిగిన ఉగ్రవాదం కారణంగానే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని భావించినట్లు సైన్యంలోని ఓ వర్గం వెల్లడించింది. టర్కీ అధికారిక ఛానల్, రేడియో కార్యాలయాలను స్వాధీనం చేసుకునేందుకు సైనిక అధికారి, నలుగురు సైనికులు విఫలయత్నం చేశారు. తీవ్రంగా ప్రతిఘటించిన పోలీసులు సైనిక అధికారి, నలుగురు సైనికులను హతమార్చారు.

English summary

Turkey soldiers attack on turkey people