బాంబు భయంతో వెనక్కొచ్చింది...

Turkish Airlines flight to Istanbul returns to Mumbai

04:16 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Turkish Airlines flight to Istanbul returns to Mumbai

టర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక విమానంలో సోమవారం మొబైల్ ఫోన్ కలకలం రేపింది. ముంబై నుంచి ఇస్తాంబుల్‌ బయలుదేరిన ఆ విమానం ఫోన్ కలకలంతో తిరిగి వెనక్కివచ్చింది. వారం వ్యవధిలో ముంబై నుంచి బయల్దేరిన విమానం మార్గమధ్యంలో వెనుదిరిగి రావడం ఇది రెండోసారి. సోమవారం ముంబై నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానాన్ని మధ్యలో వెనక్కుమళ్లించారు. విమానంలో ఓ మొబైల్ ఫోన్ తెగ మోగుతున్నా.. ఎవరూ దాన్ని ఆన్సర్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. సెల్‌ఫోన్లను కూడా బాంబులకు ట్రిగ్గర్లుగా వాడే అవకాశం ఉండటంతో.. విమానంలో ఎక్కడైనా బాంబు పెట్టారేమోనన్న భయంతో దాన్ని మళ్లీ ముంబై మళ్లించారు. ముంబైలో విమానాన్ని ల్యాండ్ చేసి క్షుణ్నంగా తనిఖీ చేశారు. ప్రయాణికులందరినీ బయటకు పంపించివేసి.. భద్రతా సిబ్బంది విమానాన్ని తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడి సీటు కింద విమాన సిబ్బంది సెల్‌ఫోన్‌ను గుర్తించారు. అయితే విమానంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత టర్కీ విమానం బయల్దేరేందుకు అధికారులు అనుమతిచ్చారు. గతవారం ముంబై-లండన్ విమానంలో ఎలుక కనిపించడంతో వెనుదిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

English summary

A Turkish Airline flight from Mumbai to Istanbul was made to return back to Mumbai after an unattended mobile phone was founded on that flight.After it returned to mumbai the flight was checked up by the staff and found a mobile phone which was belongs to one of the staff