అబ్బురపరుస్తున్న రోబో కార్(వీడియో)

Turkish engineers build a remote controlled robot car

05:03 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Turkish engineers build a remote controlled robot car

ఇదో వింత కారు. దీన్ని ఏకంగా పన్నెండు మంది ఇంజనీర్లు.. నలుగురు టెక్నిషియన్లు కష్టపడి తయారు చేసారు. ఎలాగంటే, ఒక ఓల్డ్ బిఎంఎం కారును జెయింట్ రోబోగా చేసేశారు. ఇక రిమోట్ నొక్కితే చాలు. కారు చేతులు బయటకొస్తాయి. కారుకు కాళ్లు వచ్చేస్తాయి. తల కూడా పుట్టుకొస్తుంది. ఇదంతా రిమోట్ నొక్కిన సెకెండ్ల టైమ్ లోపే జరిగిపోతుంది. ఇదెలా సాధ్యం అంటారా? టర్కీకి చెందిన ఇంజనీర్ల గ్రూపు ఒకటి తమ మేధస్సుకు పదునుబెట్టి ఒక్క బటన్ తో పని చేసే రిమోట్ కారు రోబోను తయారు చేసింది. రిమోట్ నొక్కగానే కొద్ది సెకన్ల కాలంలో రెండు చేతులు, కాళ్లు మాదిరి బయటకు చొచ్చుకొస్తాయి.

2017 కల్లా అన్ని హంగులతో ఈ రోబో రెడీ అవుతుందట. ప్రస్తుతానికి లండన్ వీధుల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ అయింది. చివరగా కారు టాప్ నుంచి పుట్టుకొచ్చిన తలతో రోబో రోడ్డు మీద వాహనాలను చూస్తుంది. టర్కీలోని లెట్ విజన్ కంపెనీకి చెందిన 12 మంది ఇంజనీర్ల బృందం తయారుచేసిన ఈ ప్రోటోటైప్ రోబోకు యాంటిమన్ అని పేరు కూడాపెట్టారు. ఇంకా రేటు ఫైనల్ కాని యాంటిమన్లను ఫ్యూచర్ లో మరింత అడ్వాన్స్డ్ టెక్నకల్ గా తయారు చేసి అమ్మకానికి పెడతారట. ప్రస్తుతానికి ట్రాఫిక్ లో తిరగడానికి అనువుగా లేని యాంటిమన్ లకు తగు మార్పులు చేసి ఎలక్ట్రిక్ ఇంజన్ బిగించి ట్రాఫిక్ లో తిరిగేలా చేస్తామని యంగ్ ఇంజనీర్ల బృందం అంటోంది.

English summary

Turkish engineers build a remote controlled robot car