సరికొత్త స్మార్ట్ ఫోన్లు - టాటూలను పోలివుంటాయి

Turn Your Skin Into Your New Touch Screen

11:13 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Turn Your Skin Into Your New Touch Screen

ప్రస్తుతం టెక్నాలజీ వలన ప్రజలకు ఎంత ఉపయోగం వుందో, అదే స్థాయిలో ఇబ్బందికరంగా కూడా మారిపోయింది. అంతెందుకు స్మార్ట్ ఫోన్లు లేకుండా క్షణం గడవని పరిస్థితుల్లో మన పాకెట్లు పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లతో బరువెక్కిపోతున్నాయ ని తిరుగులేని నిజం. ఈ కష్టాలను అధిగమించేందుకు సరికొత్త ఇన్నోవేషన్స్ వచ్చేస్తున్నాయిప్పుడు. డివైజ్ లతో పనిలేకుండా మొత్తం స్మార్ట్ ఫోన్ ఆపరేషన్ అంతా చేతిమీదే చేసుకునే వెసులుబాటు కలిగింది.

ఎలక్ట్రానిక్ ఇ స్కిన్ బేస్డ్ టెక్నాలజీ ద్వారా తమకు నచ్చిన చోట, నచ్చిన విధంగా మొబైల్స్ వాడుకునే వీలు దీని ద్వారా కలుగుతుంది. చూడ్డానికి చర్మంపై టాటూల మాదిరి కనిపించి పనులు చేసిపెడుతుంది ఈ కొత్త టెక్నాలజీ. దీనివల్ల చర్మానికి కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని శాస్త్రవేత్తలు అంటున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చకచకా జరుగిపోతున్నాయి.

English summary

Turn your skin into your new touch screen.