ఫోర్జరీ సంతకాల కేసులో టివి నటికి మూడేళ్ల జైలు శిక్ష

TV Actress Indu Verma Jailed For Three Years

09:46 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

TV Actress Indu Verma Jailed For Three Years

ఫోర్జరీ సంతకాల కేసులో టివి నటికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. హిందీలో పలు టీవి సీరియల్స్ తో ప్రేక్షకులకు చేరువైన నటి ఇందూ వర్మను కోర్టు దోషిగా తేలుస్తూ, శిక్ష విధించింది. 1996లో ఆమె చెక్కులను ఫోర్జరీ చేసి నగలు కొనుగోలు చేసి, తమను 17.50 లక్షల రూపాయలమేర మోసగించిందని థామస్‌ కుక్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కోర్టుకెక్కింది. తాను శివానీ ఆరోరాగా పేర్కొంటూ.. తన ఉద్యోగి పేరిట సంతకాలు ఉన్న మూడు చెక్కులతో ఇందూ వర్మ నగలు కొనుగోలు చేసి తమను మోసగించిందని జెవెలరీ దుకాణం యజమాని 1996లో ఫిర్యాదు చేశాడు. ఈ వాదనతో ఏకీభవించిన ఢిల్లీ కోర్తు ఐపీసీ సెక్షన్లు 419 (మరో వ్యక్తిగా నటించి చీటింగ్ చేయడం), 403 (ఆస్తుల దుర్వినియోగం), 467 (ఫోర్జరీ), 420 (చీటింగ్) తదితర అభియోగాలపై దోషిగా తేల్చి ఇందూ వర్మకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాదాపు 20 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ సాగడం విశేషం. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి ఇందూవర్మకు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. మరి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఇక శ్రీవారి దర్శనం గంటలోనే

ప్రపంచాన్ని గడగడలాడించే పాత్రలో పవర్ స్టార్

650 మందితో సెక్స్ చేసిన క్రికెటర్

English summary

Television Actress Indu Verma was jailed for three years for forgery case.She had forgered the Signature and she used to purchase Jewellery .