అబ్బో.. ఈ ఆంటీకి అంతమంది ఫాలోయర్స్ ఆ?

Tv Actress Shailaja Priya Has 38 Lakh Facebook Followers

12:41 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Tv Actress Shailaja Priya Has 38 Lakh Facebook Followers

అవునా, అలాగైతే ఏమిటి అందుకు ఎలా అనే సందేహం రావడం సహజం ... ఏ మాత్రం పరిచయ వ్యాఖ్యలు అవసరం లేని ఒకప్పటి సినిమా హీరోయిన్ అయిన మామిళ్ళ శైలజా ప్రియ, పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరంగా జరిగింది. మొత్తానికి ఇక రెండో ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించేందుకు ప్రయత్నాలు చేయగా.. ప్రభాస్ మూవీ మిర్చిలో హీరోయిన్ రిచాకు తల్లిగా నటించే ఛాన్స్ దక్కింది. అయితే.. ఆ తర్వాత ఆమెకి అవకాశాలు రాకపోయినా, ఈమె మోస్ట్ పాపులర్ నటిగా కొనసాగుతోంది. ఆవివరాల్లోకి వెళ్తే,

ఈ ఆర్టిస్ట్ ప్రియా కి సినిమాల్లో అవకాశాలు లేకపోయినా..బుల్లితెర పై మాత్రం బాగానే సందడి చేస్తోంది. అనేక టీవీ సీరియల్స్ లో నటిస్తూ.. తన నటనతో ఆడియన్స్ కి చేరువయ్యింది. దాంతో ఈమెకి భారీ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ కారణంగానే సోషల్ మీడియాలోనూ అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఈమె ఫేస్బుక్ ఫాలోవర్స్ 38 లక్షలకు చేరారు. సాధారణంగా సోషల్ మీడియాలో లక్షల ఫాలోయింగ్ ని అందుకోవడం కోసం టాప్ నటీనటులే నానా తంటాలు పడడం సహజం . ఎందుకంటే, మూవీస్ కి సంబంధించిన విశేషాలు, తమ పర్సనల్ వ్యవహారాలు, ఇంకా రకరకాల అప్డేట్స్ ఇచ్చినప్పటికీ.. అంత త్వరగా ఫాలోవర్స్ సంఖ్య పెరగదు. కానీ.. ఓ బుల్లితెర నటి అయిన ప్రియకు ఏకంగా 3.8 మిలియన్ ఫాలోవర్స్ వుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇందుకు కారణం మాత్రం ఆమె అందంతో పాటు ముఖ్యంగా తన నవ్వు అని అంతా అనుకుంటున్నారు. ప్రతిరోజూ తన బ్యూటిఫుల్ సెల్ఫీలతోపాటు ఇంకా రకరకాల ఫోటోలు అప్లోడ్ చేయడం వల్ల ఈమెకు బోలెడంత ఫాలోయింగ్ వచ్చిపడిందని అంటున్నారు.. మొత్తానికి ఈ బుల్లితెర ఆంటీ సోషల్ మీడియాలో మాత్రం బాగానే సందడి చేస్తూ.. స్టార్ హీరోలకే చెక్ పెడుతుండడం మామూలు విషయం కానే కాదు.

ఇవి కూడా చదవండి:సమంత మ్యారేజ్ లీక్.. హీరో ఇంట్లో కలకలం

ఇవి కూడా చదవండి:ఈమెకు నిర్మాతలతో రోజుకు మూడుసార్లు కావాలట(వీడియో)

English summary

Tollywood Actress and Tv Serial actress Shailaja Priya has a huge fan following Facebook and she has more than 38 lakh Facebook fan followers.