అమ్మతోడు ఎవర్నీ వేధించలేదు

Tv Actress Sri Vani Media Talk About Her Assets Issue

11:29 AM ON 16th July, 2016 By Mirchi Vilas

Tv Actress Sri Vani Media Talk About Her Assets Issue

ఆడపడుచులుగా తమ కు రావాల్సిన ఆస్తి ఇవ్వాలంటూ బుల్లితెర నటి శ్రీవాణి, ఆమె అక్కా చెల్లెళ్లు తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ అనూష పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొత్తకొత్త వాదనలు వినిపిస్తున్నాయి. అసలు రంగారెడ్డి జిల్లా పరిగిలో ఉన్న ఆస్తితో తనకు ఎలాంటి సంబంధం లేదని, అక్కడ తన పేరిట ఏవైనా ఆస్తులుంటే వదిన అనూషకు రాసిచ్చేందకు సిద్ధమని శ్రీవాణి స్పష్టం చేస్తోంది. తనది కాని ఆస్తిని తాను ఎన్నడూ ఆశించనని, తన తండ్రి ఆస్తిలో వచ్చే వాటాను కూడా వదులుకునేందుకు సిద్ధమని ఆమె ప్రకటించింది. తాండూరులోని తన అక్క నివాసంలో తల్లిదండ్రులు, చెల్లెళ్లు, బావలతో కలిసి శ్రీవాణి విలేకరులతో మాట్లాడింది. పరిగి ఆస్తి విషయంలో తండ్రి అభీష్టం మేరకు నడుచుకుంటానన్నారు. వదిన అనూషను తాను ఎన్నడూ వేధించలేదని పేర్కొంటూ, అయినా ఆమె తనపై ఎందుకు ఆరోపణలు చేస్తుందో ఆర్థం కావడం లేదన్నారు. పరిగిలోని ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించలేదని, తనపై అనవసరంగా కక్షగట్టి ఫిర్యాదు చేసిందని వాపోయారు. కాగా శ్రీవాణిపై నమోదైన కేసు విషయంలో వికారాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. సీఐ నిర్మల పరిగిలోని బాబ్జీ ఇంటిని సందర్శించారు.

నా భర్త ఆస్తి శ్రీవాణికి ఎలా దక్కుతుందన్న అనూష ...

శ్రీవాణి మా చిన్న అత్త కూతురు. నా భర్త ఉన్న రోజుల్లోనే ఇంటిస్థలంలో వాటా ఇవ్వాలని శ్రీవాణి పలుమార్లు ఒత్తిడితెచ్చింది. బాబ్జీ చనిపోయాక సగం వాటా ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు పాల్పడుతోంది. ఇటీవల కొందరు వ్యక్తులతో ఇంటికి వచ్చి జేసీబీతో కూల్చివేసేందుకు ప్రయత్నించింది. అడ్డుకుంటే దాడికి పాల్పడింది. అయినా నా భర్త ఆస్తి శ్రీవాణికి ఎలా వస్తుంది? అంటూ అనూష ప్రశ్నిస్తోంది.

ఇవి కూడా చదవండి:ఇద్దరు వైఫ్ లు స్యూసైడ్ చేసుకోగా, మూడో భార్యను గన్ తో కాల్చేశాడు

ఇవి కూడా చదవండి:జనతా గ్యారేజ్ వాయిదాకు కారణం ఏంటబ్బా!

English summary

Tv Actress Sri Vani talked with media with her sisters and her husband by saying that she was never hurted her sister in law for assets.