అడిగినంతా .. ఇస్తేనే ఒప్పుకునేది

Tv anchor Anasuya demands huge remuneration

10:39 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Tv anchor Anasuya demands huge remuneration

ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయకి... ఉన్నట్టుండి ఒకేసారి క్రేజ్ వచ్చి పడింది. అది ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు కనుక ఆ క్రేజ్ ని కాసులుగా మార్చుకునేందుకు రెడీ అయింది. బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్ గా మారిన అనసూయ... వెండితెరపై కూడా పెద్ద మొత్తంలోనే డిమాండ్ చేస్తోంది. సోగ్గాడే చిన్నినాయనా, క్షణం సినిమాలలో నటించాక ఆమెకి అవకాశాలు బానే వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే అనసూయ... తనకి రూ.50లక్షలు ఇవ్వగలిగే వారు మాత్రమే కథ చెప్పేందుకు రావాలని షరతు విధించినట్టు ఫిల్మ్ నగర్లో టాక్. రాశిఖన్నాలాంటి హీరోయిన్లే... రూ. 25 లక్షలకి నటిస్తుంటే, అనసూయ అంత డిమాండ్ చేయడం ఏమిటంటూ విమర్శలు వచ్చాయి. అయితే అనసూయ తక్కువేం తినలేదు, అందుకే ఆ విమర్శలకి కూడా సమాధానం ఇచ్చింది . తాను బుల్లితెరపై ఒక్క ఎసిపోడ్ కి రూ.లక్ష తీసుకుంటుంటే... సినిమా చేసేందుకు రూ.50లక్షలు తీసుకోవడంలో తప్పేంటని ప్రశ్నించింది. ఇక తన ఫేస్ బుక్ ఎకౌంట్ కు ఉన్న క్రేజ్ ని చూస్తే... రూ.50లక్షలు ఇవ్వవచ్చని కూడా చెప్పుకొస్తోంది. మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతని అనసూయ అక్షరాలా ఫాలో అయిపోతోంది.

ఇది కూడా చూడండి:అక్కడ ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారట..

ఇది కూడా చూడండి:అమ్మాయిలు... ఈ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసారా?

ఇది కూడా చూడండి:ఐపీఎల్ లో క్రికెటర్ల జీతాలు చూస్తే షాకవ్వల్సిందే

English summary

Anasuya famous television Anchor. Aanasuya demands huge remuneration.