వందేళ్ల వయసులోనూ సుమ బామ్మ స్పీడు (వీడియో)

TV Anchor Suma 100 Years Grandmother

10:31 AM ON 16th September, 2016 By Mirchi Vilas

TV Anchor Suma 100 Years Grandmother

ఈ బామ్మ రీసెంట్ గా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ వయసులోనూ చక్కగా దోశెలు వేస్తూ మనవరాళ్లతో హాయిగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెబుతోంది. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో దాదాపు 6 లక్షల మంది కి పైగా తిలకించడం నిజంగా హైలైట్. మూడువేల మంది దీన్ని షేర్ చేయగా, 54వేల మంది లైక్ చేయడం అందులో విశేషం.

ఇంతకీ ఈమె ఎవరంటే, తెలుగు టీవీ యాంకర్ సుమ గ్రాండ్ మదర్. ఈమె గత మంగళవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ వేడుకలను ఈ బామ్మ కేరళలో జరుపుకుంది. ఇందుకోసం యాంకర్ సుమ, భర్త రాజీవ్ కనకాల అక్కడికి వెళ్లారు. విదేశాల్లో ఈ బామ్మ బంధువులు కూడా హాజరయ్యారు. ఈ సెలబ్రేషన్స్ కి గుర్తుగా అమ్మమ్మతో దోశెలు వేస్తూ తీసిన ఒక వీడియో కూడా ఆమె తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. నెటిజన్ల కామెంట్లు కూడా అదిరిపోతున్నాయి.

English summary

TV Anchor Suma Grandmother preparing dosa at the age of 100 Years.