మొగుడికి-కూతురుకు చెప్పకుండా ఆ నటి రెండో పెళ్లి చేసేసుకుంది

Tv artist Subhasree leaved husband and did second marriage

11:13 AM ON 10th June, 2016 By Mirchi Vilas

Tv artist Subhasree leaved husband and did second marriage

సినిమా యాక్టర్లు పెళ్ళిళ్ళు చేసుకోవడం, తూచ్ అనడం సహజం... అస్సలు అలాంటివి పట్టించుకోరు.. కానీ తమిళనాడులో బుల్లితెర మీద సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన టీవీ నటి శుభశ్రీ మరీ విడ్డూరంగా ఓ పని చేసేసింది. దీంతో ఆమె పేరు ప్రస్తుతం ఆ రాష్ర్టంలో మార్మోగుతుంది. పెళ్లయ్యి ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నా ఆమె వారికి తెలియకుండా సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కింది. సొంధంబంధం తదితర టీవీ సీరియల్స్ లో నటించి తమిళనాడు బుల్లితెర పై బాగా పాపులర్ అయిన నటి శుభశ్రీ 2007లో మన్నార్ గుడికి చెందిన ఇంజనీర్ శరవణన్ ను వివాహమాడింది.

వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. భర్తతో బాగానే ఉంటున్న ఆమెకు ఉన్నట్టుండి ఏమైందో ఏమో గాని ఇటీవల శుభశ్రీ మాధవరంకు చెందిన శీనివాసన్ అనే యువకుడిని రహస్యంగా పెళ్లి చేసేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శుభశ్రీ మొదటి భర్త శరవణన్ ఎగ్మూర్ కోర్టులో కేసు వేసాడు. ఈ కేసు పై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ గోపీనాధ్ విచారణకు హాజరు కావాలని శుభశ్రీకి సమన్లు పంపారు. అయితే విచారణకు ఆమె హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. చివరకు మంగళవారం ఆమె కోర్టులో లొంగిపోగా, జూలై 5న తదుపరి విచారణకు హాజరుకావాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనతో ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా శుభశ్రీ ఉదంతం పైనే చర్చ.

English summary

Tv artist Subhasree leaved husband and did second marriage