ప్రాణం మీదికి తెచ్చిన ప్రయోగం..

Tv Journalist Stabbed Accidentally

06:34 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Tv Journalist Stabbed Accidentally

ప్రాణాలు కాపాడుకునేందుకు తయారు చేసిన కోటు అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. పాలస్తీనా నుంచి నిత్యం ఎదురవుతున్న కత్తిదాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఓ కంపెనీ కోటును రూపొందించింది. దీన్ని ధరిస్తే కత్తిపోట్ల నుంచి రక్షణ పొందవచ్చని హామీ ఇచ్చింది. దీని పై వార్త ఇచ్చేందుకు సిద్ధమైన జర్నలిస్ట్ ఇతామ్ లాంకోవర్.. స్వయంగా కోటును పరీక్షించాలనుకున్నాడు. కోటు తొడుక్కుని కెమెరా సాక్షిగా పరీక్ష ఎదుర్కొన్నాడు. అయితే వెనుక నుంచి పొడిచిన కత్తి అతడి నడుముకు పైభాగంలో దిగడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ప్రమాదవశాత్తు ఇలా జరిగిందని సదరు కంపెనీ తెలిపింది. ప్రొటెక్టివ్ మెటీరియల్ లేని చోట కత్తితో పోవడంతో గాయమైందని వివరించింది. తాము తయారు చేసిన కోటు కత్తిపోట్ల నుంచి కచ్చితంగా రక్షణ కల్పిస్తుందని పునరుద్ఘాంటించింది. ఆస్పత్రి పాలైన ఇతామ్ లాంకోవర్ గాయానికి కుట్లు వేయించుకుని బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు.

English summary

An Israeli journalist has been stabbed accidentally while demonstrating a protective vest for a TV report.