గోవా సెక్స్ రాకెట్లో తారలు, మోడల్స్ షాకింగ్ న్యూస్

TV stars and models doing that business in Goa

01:40 PM ON 11th June, 2016 By Mirchi Vilas

TV stars and models doing that business in Goa

ఈమధ్య సెక్స్ కుంభకోణాల జోరు పెరిగిపోయింది. ఇందులో తారలు , సెలబ్రిటీలు వుండడం ఇంకా ఆందోళన కలిగిస్తోంది.తాజాగా గోవాలో జరిగిన హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. తారలను, మోడల్స్ ను ప్రసిద్ధమైన హోటళ్లకు రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్టు తేలిందని అంటున్నారు. ఒక్కో కస్టమర్ నుంచి మోడల్ లేదా తార ఐదు లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు, చాలా మంది విటులు కార్పోరేట్ కంపెనీలకు చెందినవారే కాక రాజకీయ ప్రముఖులని వార్తలు వచ్చాయి. ఈ సెక్స్ రాకెట్ తో పలువురు బుల్లితెర తారలకు, మోడల్స్ కు సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. మహారాష్ట్ర, గోవాల్లో నిర్వహిస్తున్న ఈ సెక్స్ రాకెట్ కు సంబంధించి ఓ కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విచారణలో సెక్స్ రాకెట్ తో సంబంధం ఉన్న హైప్రొఫైల్ విటులు, తారలు, మోడల్స్ గురించి కీలక సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. పానాజీ శివారులోని టోనీ హౌసింగ్ కాలనీలో ఆనంద్ కుమార్ అలియాస్ ఆండీ అనే వ్యక్తిని ఈ సెక్స్ రాకెట్ కేసులో అరెస్ట్ చేశారు. ఆనంద్ కుమార్ ఇంటి నుంచి విటులు, మోడల్స్ , తారలకు సంబంధించి ఆధారాలు సేకరించారారట. అతడి ఇంట్లో దొరికిన ఆధారాల్లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సంబంధించి చాలా వివరాలు ఉన్నప్పటికీ, వారి వివరాలను పోలీసులు బయట పెట్టడం లేదట.

ఆనంద్ కుమార్ కింద పనిచేస్తున్న మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పనాజీ సమీపంలోని ఓ ఫ్లాట్ నుంచి ముగ్గురు మహిళలను కాపాడారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. గోవాకు, పానాజీకి మధ్య గల రీబందర్ ప్రాంతంలోని ఓ భవనంపై సోదా చేసి పోలీసులు రాకెట్ గుట్టు విప్పారు. సూత్రధారి ఆనంద్ కుమార్ తో పాటు ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గత నాలుగేళ్లుగా ఈ సెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు ఎస్పీ కశ్యప్ తెలిపారు.

ఇది కూడా చూడండి:ఆమె ఇంట్లో బయట పడ్డ రహస్య గది

ఇది కూడా చూడండి:నేపాల్ లో వింత: శిలగా మారుతున్న బాలుడు(ఫోటోలు)

ఇది కూడా చూడండి:తండ్రి గురించి బ్రహ్మణి షాకింగ్ కామెంట్స్

English summary

TV stars and models doing that business in Goa.