టీవి9 రవిప్రకాష్ కొత్త ఛానెల్ పెడుతున్నాడా?

TV9 CEO Ravi Prakash putting new channel

03:36 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

TV9 CEO Ravi Prakash putting new channel

రాష్ట్ర విభజన జరిగి రెండేళ్ళు అవుతున్నా, ఇంకా న‌వ్యాంధ్ర కోసం ప్ర‌త్యేకంగా ఒక మీడియా ఛానెల్ లేకుండా పోయింది. ఇప్పటికే ఏపీలో తొలి ఛానెల్ కోసం చాలా మంది సన్నాహాలు చేసి, ఆ తరువాత వెనుకడుగు వేశారు. అయితే ఇప్పుడు ఓ ఛానెల్ రాబోతోందనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని, ఇందుకోసం ఒక రాజ‌కీయనాయ‌కుడి కుమారుడు, తెలుగులో బాగా పాపుల‌ర్ అయిన ఛానెల్ సీఈవో క‌లిసి ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోందని అంటున్నారు. తెలుగు మీడియా రంగంలో సంచ‌ల‌నాల‌కు తెర తీసిన టీవీ9 వ్య‌వ‌హారం కొలిక్కి వ‌చ్చింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ అనుచరుడిగా పేరొందిన వ్యాపార‌వేత్త జూప‌ల్లి రామేశ్వ‌రావు ఆధ్వ‌ర్యంలో స‌రికొత్త‌గా మార‌బోతోంది! అయితే టీవీ సీఈవో ర‌విప్రకాష్ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న అందులోనే కొన‌సాగుతారా? లేక స‌రికొత్త ఆలోచ‌న‌లు ఉన్నాయా? అని సందేహ‌ప‌డుతున్నారు. టీవీ9లో వాటాదారుడిగా ఉంటూనే సీఈవో హోదాలో ఇన్నాళ్లుగా చక్రం తిప్పిన రవి ఇప్పుడు ఏపీలో మీడియా వ్యవహారాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అది వెంటనే చేస్తారా.. లేక ఒక ఏడాది విరామం తర్వాత ఆయన ఏపీ కోసం ప్రత్యేక మీడియా అంటూ రంగంలో దిగుతారా అన్నదే ఇంకా కొలిక్కి రాలేదు.

ఇక ఏపీకోసం ప్రత్యేకంగా ఓ ఛానెల్ ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అదే సందర్భంలో చంద్రబాబు కి కాస్త సన్నిహితుడిగా పేరున్న రవి ప్రకాష్ మీడియా కోసం ప్రయత్నం చేస్తే అది ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఛానెల్ పై పార్టీ ముద్ర ప‌డ‌కుండా న‌డిపించే వ్య‌వ‌హారం ర‌వి ప్ర‌కాష్ చూసుకునేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని, తెర వెనుక లోకేష్ న‌డిపిస్తార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీలో త్వరలోనే ఓ ఛానెల్ రావడం ఖాయం. అయితే అది ఎవరనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

English summary

TV9 CEO Ravi Prakash putting new channel with Nara Lokesh.