తెలంగాణా చంద్రుడు దారికి టివి 9

Tv9 channel rights to telangana CM KCR's friend

02:56 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Tv9 channel rights to telangana CM KCR's friend

ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టిడిపి వాళ్ళను దారికి తెచ్చుకున్న తెలంగాణా సిఎమ్ కెసిఆర్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ల పై కూడా వల విసురుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక తనకు ఎగైనిస్ట్ గా ఉన్న మీడియాను కూడా పనిలో పనిగా దారికి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో టివి-9 మీద గురి పెట్టినట్లు చెబుతున్నారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల అనంత‌రం కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే తెలంగాణ‌లో ఏబీఎన్‌తో పాటు టీవీ-9 ఛానెల్ పై కేబుల్ ఆప‌రేట‌ర్లు నిషేధం విధించారు. అయితే త‌ర్వాత టీవీ-9 తాము ప్ర‌సారం చేసిన క‌థ‌నానికి క్ష‌మాప‌ణ చెప్పుకుని మ‌ళ్లీ త‌న ప్ర‌సారాలు పున‌రుద్ధ‌ర‌ణ చేసుకుంది. తెలుగు న్యూస్ ఛానెల్ రంగంలో ఓ విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తెచ్చిన ఘ‌న‌త టీవీ-9 ఛానెల్‌దే.

టీవీ-9 త‌ర్వాత ఎన్నో న్యూస్ ఛానెళ్లు వ‌చ్చాయి. అయితే నెంబ‌ర్ వ‌న్ మాత్రం టీవీ-9 ఛానెల్ మాత్రమే. అలాంటి క్రేజీ న్యూస్ ఛానెల్‌ను ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్రెండ్ సొంతం చేసుకోనున్నాడ‌నే వార్త‌లు మీడియాలో వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ విధంగా దారికి తెచ్చుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే, టీవీ-9 ఛానెల్ కూడా కేసీఆర్ భ‌జ‌న ఛానెల్‌గా మారిపోతుంద‌న‌డంలో సందేహం లేదని పలువురు విమర్శకుల కామెంట్.

English summary

Tv9 news channel rights to telangana CM KCR's friend.