ట్వీట్‌ లిమిట్  10వేల క్యారెక్టర్ల కు పెంపు 

Tweets Limit Increased To 10Thousand

12:23 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Tweets Limit Increased To 10Thousand

సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్‌ లలో కీలకమైన ట్విట్టర్‌లో ట్వీట్‌ లిమిట్ భారీగా పెరిగింది. దేశాది నేతల నుంచి సామాన్యుల వరకు విస్తృతంగా వినియోగిస్తున్న ట్విట్టర్ ప్రముఖ మీడియా సాధనంగా వెలుగొందుతోంది. సెలబ్రిటీలు , వివిఐపిలు తమ వ్యాఖ్యలను , కదలికలను ట్వీట్ చేస్తుంటే , వాటినే ఎలక్ట్రానిక్ మీడియా , ప్రింట్ మీడియా వార్తలుగా మలచుకుంటున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సడన్ గా పాకీస్తాన్ వెళుతూ, విషయాన్ని ట్వీట్‌ చేసారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్పందన , పర్యటనలు కూడా ట్వీట్‌ చేసిన విషయాలే, వార్తలుగా మారుతున్నాయి. ఇక సంచలనానికి , వివాదస్పద వ్యాఖ్యలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ ట్వీట్‌ సంగతి తెల్సిందే. ఇలా ట్వీట్‌ కి విపరీతమైన గిరాకీ పెరిగింది.

అయితే చాలా తక్కువ క్యారక్టర్స్ ఇందులో వుండడం వాలా , ఒకటికి నాలుగుసార్లు ట్వీట్‌ చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ బాధ తొలగినట్లే. ఇప్పటి వరకు కేవలం 140క్యారెక్టర్లతో మాత్రమే ట్వీట్‌ చేసే అవకాశం ఉండేది. ఇక ముందు దానిని 10వేల క్యారెక్టర్ల వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 140 క్యారెక్టర్ల పరిమితిని ఎత్తివేయనున్నట్లు గతంలోనే ప్రకటించగా, ఇప్పుడు మరోసారి స్పష్టం చేస్తూ , ఈ మేరకు కంపెనీ సీఈవో, కో-ఫౌండర్‌ జాక్‌ డోర్సే తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

140 కార్యరెక్టర్ల పరిమితి ఎత్తివేశామని సూటిగా చెప్పకుండా జాక్‌డోర్సే తన ట్విట్టర్‌లో 1,325క్యారెక్టర్లతో కూడిన ట్వీట్‌ని ప్రయోగాత్మకంగా పోస్ట్‌ చేసారు. 300మిలియన్‌ వినియోగదారులు తమ ట్వీట్‌లో 300కన్నా ఎక్కువ క్యారెక్టర్లు వినియోగిస్తున్నట్లు తాము గమనించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. ఇక ట్వీట్‌ లకు భలే గిరాకీ..... ఊ ... మొదలెట్టండి.

English summary

Famous Social Networking Site Twitter has increased the tweets limit from 140 characters to 10 thousand