రవిశంకర్ పై ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Twinkle Khanna Sensational Comments On Sri Sri Ravi Shankar

10:53 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Twinkle Khanna Sensational Comments On Sri Sri Ravi Shankar

ఈ మధ్య బాలీవుడ్ భామలు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ దుమారం రేపుతున్నారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో భార్య.. ఒకప్పటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాక ఓ అనవసర వివాదంలో వేలు పెట్టింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు. ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ మీద ఆమె ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపాయి. సినిమాలకు గుడ్ బై చెప్పేశాక కుటుంబ జీవనానికే ప్రాధాన్యమిచ్చిన ట్వింకిల్ అప్పుడప్పుడూ పత్రికల్లో కాలమ్స్ అవీ రాస్తుంటుంది. ట్విట్టర్లోనూ కొన్ని ఆసక్తికర పోస్టులు పెడుతూ..కామెంట్లు చేస్తుంటుంది. ఐతే ఈ మధ్య ఆమె దృష్టి రవిశంకర్ మీదికి ఎందుకు వెళ్లిందో కానీ..‘‘శ్రీ శ్రీ రవిశంకర్ ఉదాత్తమైన ఆలోచనలు ఉన్నవారు. ఐతే ఆయనకు యోగా చేసే విధానం ఇబ్బందికరంగా ఉంటుంది. యోగా చేసేటప్పుడు ఆయన సగం గడ్డం నోటిలోకే వెళ్తుంది. ఈ విషయంలో రాందేవ్ బాబా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు’’ అని ట్వింకిల్ ట్వీట్ చేసింది. అంతటితో ఆగిందా అంటే అదీ లేదు. ఆ ట్వీట్ కు ‘హోలీ మెన్ అండ్ హెయిరీ టేల్స్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది.

ఇవి కూడా చదవండి: మహేష్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?

ఈ ట్వీట్ రవిశంకర్ అభిమానుల మనోభావాల్ని దెబ్బ తీసింది. దీంతో ఆమెను తిట్టిపోస్తూ ట్వీట్లు గుప్పించారు వాళ్లంతా. అంతటితో ఆగకుండా ట్వింకిల్ పెట్టిన ట్వీట్ కు నిరసనగా.. ఆమె భర్త నటించిన ‘హౌస్ఫుల్-3’ సినిమాను బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు. దీంతో ట్వింకిల్ తప్పయిపోయిందంటూ లెంపలేసుకుంటూ , వెంటనే తన ట్వీట్ తీసేసింది. ‘‘ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. అది కేవలం జోక్ మాత్రమే. పొరపాటు చేసి ఉంటే దిద్దుకుంటా’’ అని వివరణ కూడా ఇచ్చుకుంది. ఐతే తన భర్త సినిమాను బహిష్కరిస్తామని చేసిన హెచ్చరికల్ని ఆమె తప్పుబట్టింది. రవిశంకర్ మీకు ఇదే నేర్పిస్తున్నారా అంటూ మండిపడింది.

ఇవి కూడా చదవండి: తమ డాన్స్‌తో మతి పోగొట్టిన కోహ్లీ, గేల్‌(వీడియో)

ఇవి కూడా చదవండి: గ్యాంగ్‌లీడర్ రీమేక్ కి రెడీయా?

English summary

Bollywood Action Hero Akshay Kumar's Wife Twinkle Khanna made some sensational Comments on Art Of Living Founder Sri Sri Ravi Shankar.Followers of Sri Sri Ravi Shankar was fired on her on twitter and later she apologized for her tweet.