అద్భుతం .... కవలలే గానీ ఇద్దరికీ 31 రోజుల గ్యాప్

Twins Be Born on Different Days

11:54 AM ON 17th December, 2016 By Mirchi Vilas

 Twins Be Born on Different Days

ఈ విశ్వంలో అన్నీ ఒకేలా జరగవు. అందుకే కొన్నిఘటనలు అద్భుతాలు జరుగుతాయి. అందునా కొన్ని అద్భుతాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. కవల పిల్లలు పుట్టడం సహజం. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో జననం ఉంటుంది. అందుకే, కవలలు ఒకరి వెంట మరొకరు వరుసగా పుట్టడం అద్భుతం కాదు. కానీ ఈ కవలలు 31 రోజుల తేడాతో జన్మించారు. అందుకే దీన్ని అద్భుతమని అనక తప్పదు. ఇటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, ఇది వైద్య పరమైన అద్భుతమని వైద్యులు చెప్తున్నారు.

డేనియల్ పౌల్ కు కవలలకు పుట్టారు. ఆమె 24 వారాల గర్భంతో ఉన్నపుడు అక్టోబరు 26న రాయల్ మహిళల ఆసుపత్రిలో ఓ పాపకు జన్మనిచ్చారు. ఆ పాపకు సాడీ అని పేరు పెట్టారు. నెలలు నిండకుండా, 710 గ్రాముల బరువుతో జన్మించిన సాడీని 1 లక్ష డాలర్ల ఖర్చుతో హైటెక్ ఇంక్యుబేటర్ లో ఉంచారు. ఓ నెల తర్వాత అంటే నవంబరు 26న డేనియల్ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకు హార్లీ అని పేరు పెట్టారు. ఈ విధంగా 31 రోజుల తేడాతో కవలలు జన్మించడం తో పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

అయితే, ఇలాంటి పరిస్థితిని ప్రసవంలో అధిక విరామం (డిలేయ్డ్ ఇంటర్వెల్ డెలివరీ) అంటారని వైద్యులు చెప్తున్నారు. డేనియల్ కు మొదటి బిడ్డ సాడీ రెండు నిమిషాల్లోనే జన్మించిందని, ఆ తర్వాత 24 గంటల వరకు ఆమె ప్రసవవేదన అనుభవించారని తెలిపారు. ప్రస్తుతం ఈ ఇద్దరు బిడ్డలు క్రిస్టమస్ సంబరాలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. వెల్ డన్..

ఇది కూడా చూడండి: కలలో మీరు గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా?

ఇది కూడా చూడండి: మీలో ఈ క్వాలిటీస్ ఉంటే కచ్చితంగా అదృష్టవంతులు అవుతారట!

ఇది కూడా చూడండి: గుడి దగ్గర మీ చెప్పులు పోతే మీకు ఏమౌతుందో తెలుసా?

English summary

Twins Be Born on Different Days