అందులోకి వెళ్లొద్దన్నందుకు కన్నతల్లిని హతమార్చారు

Twins Killed Their Mother For Not Allowing Them To Join In Saudi Arabia

10:52 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Twins Killed Their Mother For Not Allowing Them To Join In Saudi Arabia

ఉగ్రవాదం ఎంత దాకా పోతోందో అర్ధం కావడం లేదు. పసి పిల్లలు సైతం ఆదిశగా ఎందుకు పోతున్నారో అంతుబట్టదు. అది ఎంత దాకా వెళుతోందంటే, చివరకు కన్నతల్లిని మట్టుబెట్టే స్థాయికి చేరుతోంది. తాజాగా ఇలాంటి ఘటన వెలుగు చూసింది. అసలే ఉగ్రదాడులతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ అంటే ఎంతటి ప్రమాదకారో తెలియంది కాదు. అందుకే అందులో చేరొద్దురా అంటే ఆ పిల్లలు వినలేదు. అందులో చేరే ప్రయత్నాలను అడ్డుకున్నందుకు కన్న తల్లిని కవల సోదరులు హత్య చేశారు. సౌదీ అరేబియాలో గత ఏడాదిలో ఇలాంటి ఘటనలు ఐదు జరగడం కలకలం రేపుతోంది.

తాజా ఘటనకు వెళ్తే, ఖలీద్, సలేహ్ అల్ ఒరైనీ అనే కవల సోదరులు ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళ్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో 67 ఏళ్ళ తల్లి హైలా, 73 ఏళ్ళ తండ్రి తో పాటు 22 ఏళ్ళ మరో సోదరుడిపై కత్తులతో దాడి చేశారు.

ఈ ఘటనలో తల్లి మృతి చెందగా మిగతా కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దాడుల తర్వాత యెమెన్ కు పారిపోతున్న కవల సోదరులను సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. మతంతో పాటు కుటుంబానికి అత్యంత గౌరవం ఇచ్చే సౌదీ అరేబియాలో ఇటీవల ఇలాంటి దారుణాలు జరగడం పట్ల ఆ దేశ ప్రజలతో పాటు పాలకులు ఆందోళన చెందుతున్నారు. మనం ఎక్కడి పోతున్నాం అనే ప్రశ్న వేధిస్తోంది. మరి దీనికి అడ్డుకట్ట పడేది ఎప్పుడో.

ఇవి కూడా చదవండి:కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఐఐటి ఖరగ్ పూర్ మాజీ విద్యార్థి

ఇవి కూడా చదవండి:సద్దాంను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్

English summary

Twin Brothers named Khaleed,Saleh in Saudi Arabia was allegedly killed their mother and attacked their father and brother with knifes for refusing them to join in Islamic states terrorists group.