గౌతమీ పుత్ర ఆడియోలో ఊహించని ట్విస్ట్!

Twist in Gautamiputra Satakarni audio launch

12:37 PM ON 8th November, 2016 By Mirchi Vilas

Twist in Gautamiputra Satakarni audio launch

నందమూరి నటసింహం బాలయ్య వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఆరంభం నుంచి ఎందులోనూ రాజీపడని ఆ మూవీ మేకర్స్, ఆడియో ఫంక్షన్ ని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు ఆడియోలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టుని దక్కించుకునేందుకు కొన్ని మేనేజ్మెంట్లు పోటీపడ్డాయి. చివరకు జె మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఫంక్షన్ హక్కులను సొంతం చేసుకుంది. ఇంతకీ జే మీడియా ఫ్యాక్టరీ బ్యాక్ గ్రౌండ్ ఏంటనే వివరాల్లోకి వెళ్తే... జే మీడియాకు గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ ప్రాజెక్టు కాదు. గతంలో 24 సినిమాల ఆడియో ఫంక్షన్స్ ని నిర్వహించిన అనుభవం వుంది..

జ్యోఅచ్యుతానంద, ఎం.ఎస్.ధోని, ఇంకొక్కడు, కబాలి, శ్రీమంతుడు, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలు జే మీడియా ఖాతాలో వున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య వందో సినిమా గౌతమిపుత్ర ప్రాజెక్టుని సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. టెలికాస్టింగ్ రైట్స్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

English summary

Twist in Gautamiputra Satakarni audio launch