పరీక్షల కోసం ఫేస్ బుక్, ట్విట్టర్ మూసేశారు

Twitter and Facebook were closed for exams

06:49 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Twitter and Facebook were closed for exams

ఏదైనా మనం ఉపయోగించే విధానం మీద ఆధారపడి వుంటుంది. చైతన్యపరిచే పోస్టులతో పాటు అన్ని రకాల అవలక్షణాలు కూడా పోస్ట్ అయిపోతున్నాయి. అంతేకాదు ప్రశ్నాపత్రాల లీక్ కి కూడా వేదికగా వాడేస్తున్నారు. తాజాగా పరీక్షల్లో మోసాలు జరగకుండా ఆపడానికి ఆఫ్రికన్ దేశమైన అల్జీరియాలో ఆదివారం సోషల్ మీడియా సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్ లను తాత్కాలికంగా నిలిపేశారు. సెకండరీ స్కూల్ పరీక్షల నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అంతకుముందు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.

విద్యాశాఖకు చెందిన అధికారులు కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. జూన్ ప్రారంభంలో జరిగిన పరీక్షకు ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఈ లీక్ కారణంగా 8 లక్షల మంది విద్యార్థుల్లో 3లక్షల మంది ఆదివారం మళ్లీ పరీక్ష రాశారు. ఈ నేపథ్యంలో మళ్లీ అవకతవకలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఫేస్ బుక్, ట్విట్టర్లపై తాత్కాలిక నిషేధం విధించారు. ఇలా సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా ఉగాండా, కాంగో బ్రాజ్జావిల్లేలలో కూడా ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. మొత్తానికి మంచి కన్నా చెడుకు వేదికగా మారడం పట్ల పలువురు సోషల్ మీడియా ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

English summary

Twitter and Facebook were closed for exams