1.25 లక్షల ట్విట్టర్‌ అకౌంట్స్ బ్యాన్

Twitter Blocks 125,000 Accounts

06:18 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Twitter Blocks 125,000 Accounts

ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు పాల్పడుతున్నాయనే కారణంగా సుమారు 1.25 లక్షల ట్విట్టర్‌ ఖాతాలపై ప్రముఖ సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్ నిషేధం విధించింది. ఐఎస్‌ ఉగ్రవాద సంబంధిత ట్విట్టర్‌ ఖాతాలు 2015 నుంచి ఎక్కువయ్యాయని, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వ్యక్తిగత ఖాతాలను తాము నిషేధిస్తున్నట్లు ట్విట్టర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గత పదేళ్లుగా సేవలందిస్తున్న ట్విట్టర్‌ సంస్థ చైల్డ్‌ పోర్నోగ్రఫీని నిషేధించింది. వాషింగ్టన్‌ డీసీ బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించిన నివేదిక ప్రకారం.. 2014లో 3 నెలల్లోనే సుమారు 46వేల ఐస్‌ ఉగ్రవాద ఖాతాలున్నట్లు తెలుస్తోంది. గతనెల్లో అమెరికా పౌరుడొకరు జోర్డాన్‌లోని పోలీస్‌ శిక్షణా కేంద్రంపై జరిగిన దాడిలో మృతిచెందగా ఆయన భార్య కోర్టులో పిటిషన్‌ వేశారు. ట్విట్టర్‌ ద్వారా ఉగ్రవాద ప్రేరేపితం ఎక్కువ అవుతోందని ఆమె న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, సామాన్యుల నుంచి వచ్చిన ఒత్తిడితో ఉగ్రవాద సంబంధ ఖాతాలను ట్విట్టర్‌ నిలిపివేసింది. దీనిపై ట్విట్టర్‌ సంస్థ స్పందిస్తూ.. ఉగ్రవాద సంబంధిత ఖాతాలను గుర్తించడానికి ఆలస్యం కాకుండా ఇప్పటికే అధిక సంఖ్యలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పింది. తమకంటూ కొన్ని నియమాలు ఉన్నాయని, హద్దులు మీరి ప్రవర్తించే ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ట్విట్టర్‌ స్పష్టం చేసింది.

English summary

Twitter blocked more than 125,000 accounts, most of them linked to the Islamic State group, as part of increased efforts to eradicate "terrorist content" on the popular messaging platform.