ప్రపంచంలో ట్విట్టర్ నగరం ఎక్కడుందో తెలుసా?

Twitter city in Spain

04:14 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Twitter city in Spain

అసలు ట్విట్టర్ నగరం ఏంటి? అసలు అది ఎక్కడ ఉంది? ఆ ఊరును ఎందుకు ట్విట్టర్ నగరం అని పిలుస్తున్నారో చూద్దాం. ఆ నగరంలో అప్పుడే పుట్టిన పాపకు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఆ పాప సోషల్ మీడియాలో హాయ్ చెబుతూ.. నేను ఇప్పుడే పుట్టాను అంటూ నగర ప్రజలనుద్దేశించి ట్వీట్ చేస్తుంది. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ నగరంలో సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో. యూరప్ లోని స్పెయిన్ దేశంలోని జున్ నగర జనాభా 3500 ఉంటుంది. ఆ నగరంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే జస్ట్ ట్విట్ చేస్తారంతే వారి పనులు అయిపోతాయి.

ఇంతకు ఆ నగరాన్ని ట్విట్టర్ నగరంగా మార్చేసింది ఎవరో తెలుసా? ఆ నగర మేయర్ సలాస్. సలాస్ 2005లో జున్ నగర మేయర్ గా ఎన్నికయ్యారు. ఆయన ప్రపంచంలోని ట్విట్టర్ యాక్టివ్ యూజర్స్ లలో ఒకరు. ఆ నగరంలో అపరిచితులు కనబడ్డా పోలీసులు ట్విట్టర్ ద్వారా పట్టేస్తారట. అలాగే డాక్టర్ అపాయింట్మెంట్ కోసం కూడా అక్కడి ప్రజలు ట్వీట్స్ చేస్తారట. ఇక స్పెయిన్ దేశంలోని దక్షిణ భాగంలో ఉన్న జున్ అనే ఈ నగరంలో స్కూల్ పిల్లలకు లంచ్ బాక్స్ దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల వరకు అన్నీ ఈ సోషల్ మీడియాలోని ట్విట్టర్ ద్వారానే చకాచకా జరిగిపోతాయట.

2011లో ట్విట్టర్ ఓపెన్ అయిన వెంటనే ఆ నగర స్వీపర్ల కాన్నుంచి ఆఫీసర్లందరూ ట్విట్టర్ ఖాతా తెరవాలని మేయర్ సలాస్ ఆదేశించారు. అప్పటి నుంచి జున్ నగరం సోషల్ మీడియా హబ్ గా ప్రజలకు సేవలందిస్తోంది.

English summary

Twitter city in Spain