ట్విట్టర్‌ పిట్టకు పదేళ్ళు ...

Twitter Completes 10 Years

05:18 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Twitter Completes 10 Years

గతంలో ఆనందం, బాధ, ఆగ్రహం, శుభాకాంక్షలు, సంతాపాలు.. విషయం ఏదైనా భావాలను పంచుకోవడానికి వేదిక వుండేది కాదు ... కానీ ఇలాంటి వాటికి గొప్ప వేదిక ట్విట్టర్‌. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మదిలో ఏ ఆలోచన మెదిలినా, సెల్ఫీ దిగినా అందులో పోస్ట్‌ చేసి తీరాల్సిందే. అంతలా ట్విట్టర్‌ జనంలోకి దూసుకెళ్లిన సోషల్ మీడియా .... సెలబ్రిటీలు, రాజకీయనాయకులను, అభిమానులను మరింత దగ్గర చేస్తున్న వేదిక ట్విట్టర్‌... . ఓ రకంగా చెప్పాలంటే సమాచార, ప్రసార మాధ్యమాన్నే మార్చేసింది ఈ ట్వీటు పిట్ట. ఇంతకీ విషయం ఏమంటే ఇంత సేవ చేస్తున్న ట్విట్టర్‌ పుట్టిన రోజు ఈవేళే. అంతేకాదు పదేళ్ల క్రితం మార్చి 21న ట్విట్టర్‌ ఒక ట్వీట్‌తో తన ప్రయాణం ప్రారంభించి, ఎందరినో తాకి తన ప్రస్తానం సాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ వినియోగదారులు రోజుకు 500 మిలియన్‌ ట్వీట్లు.. ఏడాదికి 200 బిలియన్ల ట్వీట్లు చేస్తున్నారు.

ట్విట్టర్‌ ఈరోజు పదో పుట్టినరోజు వేడుక జరుపుకొంటోంది. మరి ఎంతో మందికి ట్విట్టర్‌ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే మనం, ఈరోజు మరి. హ్యాపీ బర్త్‌డే చెప్పేద్దాం. పదవ వార్షికోత్సవం సందర్భంగా ట్విట్టర్‌ సరికొత్త హ్యాష్‌ట్యాగ్‌ ఎమోజీని ప్రవేశపెట్టింది. వినియోగదారులు ట్విట్టర్‌పై తమకున్న ప్రేమను వ్యక్తపరిచేందుకు లవ్‌ట్విట్టర్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌కు హృదయాకారం, ట్విట్టర్‌ బర్డ్‌ చిత్రాలతో కొత్త ఎమోజీలను జతచేర్చింది. అమెరికాలో ప్రారంభమై ప్రపంచమంతా చుట్టేస్తున్నామని, ట్విట్టర్‌ ప్రారంభించి పదేళ్లు అయిన సందర్భంగా సంస్థ వినియోగదారులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ వీడియో పోస్ట్‌ చేసింది. " పదేళ్ల క్రితం మార్చి 21న ఒకే ఒక్క ట్వీట్‌తో ప్రయాణం మొదలుపెట్టాం. అప్పటి నుంచి ప్రతి క్షణంలో ప్రజలు తమ భావాలను ట్విట్టర్‌తో పంచుకుంటున్నారు" అని ట్విట్టర్‌ ఆనందం వ్యక్తంచేస్తోంది.

English summary

World's Popular Social Networking site Twitter Completes 10 years today.On the occasion of twitter birthday Twitter launched a new emoji's in its site.