ట్విట్టర్‌ లో మరో కొత్త ఫీచర్

Twitter Launches GIF Search Feature

09:51 AM ON 20th February, 2016 By Mirchi Vilas

Twitter Launches GIF Search Feature

ఇప్పటికే సోషల్ మీడియా వాడకం విస్తృతంగా ఉండడంతో వినియోగదారులకు అనువైన కొత్త ఫీచర్స్ ప్రవేశ పెడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ ట్విట్టర్‌ తన యూజర్లను మరింత ఆకట్టుకునే సరికొత్త ఫీచర్ల రూపకల్పనలో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టింది. యూజర్లు ఇక పై తమ భావోద్వేగాలను కదిలే బొమ్మలు జిఫ్‌ ఫార్మాట్లో పోస్ట్‌ చేసుకోవచ్చని ట్విట్టర్‌ బ్లాగ్‌లో పోస్ట్‌ చేసింది. ఉపయుక్తంగా ఉండే జిఫ్‌ ఇమేజ్‌లను తమ లైబ్రరీలో సెర్చ్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. కొత్త వారితో పాటు పాత యూజర్లను ఆకర్షించేందుకు ట్విట్టర్‌ మరిన్ని ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇక ఎందుకు ఆలస్యం కొత్త ఫీచర్ వినియోగం కోసం యూజర్లు సిద్ధం కండి.

English summary

World's Popular Social Networking Site Twitter Launched a new interesting feature.Twitter said on Wednesday in a blog post that users could search and browse a GIF library when composing a tweet or direct message. A GIF, short for graphic interchange format, is a moving image that plays over and over again. It is often used on social media to express users' emotions.