జమ్మును పాకిస్థాన్‌లో, జమ్ముకాశ్మీర్‌ను చైనాలో చూపిన ట్విట్టర్‌

Twitter shows Jammu in Pakistan, Jammu & Kashmir in China

10:20 AM ON 19th February, 2016 By Mirchi Vilas

Twitter shows Jammu in Pakistan, Jammu & Kashmir in China

ఓకే దేశానికి చెందిన ప్రాంతాలను మరో దేశంలో చూపడం ఎంత దారుణం. ఇలా ఎవరు చేసినా పెద్ద తప్పే . ఇది చేసింది సోషల్ మీడియా లో దూసుకుపోతున్న ట్విట్టర్‌ చేసింది. అందుకే అందరూ ఉతికి ఆరేస్తున్నారు. భారత భూభాగాలను విదేశీ భూభాగాలుగా చూపిస్తూ ట్విట్టర్‌ చేసిన ఈ తప్పిందంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే, జమ్మును పాకిస్థాన్‌లో భాగంగా, జమ్ముకశ్మీరును చైనాలో భాగంగా చూపించింది. పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీరును పాకిస్థాన్‌లోని అజాద్‌ కాశ్మీరు ప్రావిన్సుగా ట్విట్టర్‌ గుర్తించింది. ఈ అంశంపై ట్విట్టర్‌తో మాట్లాడతామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాస్‌స్వరూప్‌ మీడియాకు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్విట్టర్‌ ఇండియా పేర్కొంది. ఖాతాదారు కొత్త ట్వీట్‌ను పోస్టు చేసినప్పుడు తన ప్రదేశాన్ని ట్యాగ్‌ చేసుకునే అవకాశాన్ని ట్విట్టర్‌ కల్పిస్తోంది. గురువారం ఒక ఖాతాదారు ట్యాగ్‌ చేసినప్పుడు జమ్మును పాకిస్థాన్‌లో.. మరొకరు జమ్ముకాశ్మీరును ట్యాగ్‌ చేసినప్పుడు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాగా చూపించింది. దీంతో విషయం బయట పడింది.

English summary

Worlds Top Social Networking Site Twitter made a Contreversial Mistake on its Page.Twitter, which is very popular among politicians, government leaders and others seeking to spread their views, also identified Pakistan-occupied-Kashmir (PoK) as 'Azad Kashmir' province of Pakistan.Due to this