ఆ10 నిమిషాలు ట్వీట్ మూగవోయింది 

Twitter Shuts Down For Ten Minutes

01:31 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Twitter Shuts Down For Ten Minutes

అవునా, నిజమే... ప్రస్తుత స్పీడ్ యుగంలో సోషల్ నెట్ వర్క్ దూకుడు ముందు ఏదీ ఆగడంలేదు. ఇంతటి విశిష్టత గల సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ప్రముఖమైన ట్విట్టర్ పిట్ట కేవలం 10 నిమిషాలు మూగవోయింది. ట్వీట్ చేసినా పనిచేయక, తన మాటల్ని ఆపేసింది. ప్రపంచ వ్యాప్తంగా తన యూజర్లు చేసే ట్వీట్లతో ప్రపంచంలోని పలు పరిణామాలకు కారణమైన ట్విట్టర్ పిట్టకు సాంకేతిక అస్వస్థతతకు గురవ్వడం పెద్ద వార్తే మరి.

వివరాల్లోకి వెళితే, భారతీయ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.53 గంటల నుంచి 8.03 గంటల వరకూ ట్విట్టర్ పని చేయలేదు. ఈ సమయంలో ఎలాంటి ట్వీట్స్ అప్ లోడ్ కాలేదు. అయిత్గే ఈ సమస్యను ట్విట్టర్ కేవలం పది నిమిషాల వ్యవధిలో పరిష్కరించింది. తమ సేవల విషయంలో చోటు చేసుకున్న అంతరాయానికి కూడా చింతిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. ప్రపంచం మొత్తం ట్విట్టర్, ఫేస్ బుక్ మీద నడుస్తున్న ఈ శకంలో ట్విట్టర్ పిట్ట కాసేపు మూగవోయిందంటే, యూజర్లకు కలిగిన ఇబ్బంది అంతాఇంతా కాదండోయ్. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ట్విట్టర్ యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపడుతుందో మరి.

English summary

Popular social networking site shuts down for ten minutes on monday night from 7:53 pm to 8:03 pm