19నుంచి ట్వీట్లే ట్వీట్లు - పరిమితి తొలగింపు

Twitter To LIft 140 Character Limit In Its Site

11:07 AM ON 14th September, 2016 By Mirchi Vilas

Twitter To LIft 140 Character Limit In Its Site

సోషల్ మీడియాలో తనదైన ముద్రవేసిన ట్విట్టర్ ఇప్పుడు తీపి కబురు అందిస్తోంది. ఇక నుంచి యూజర్లు తమ ట్వీట్లను కుదించాల్సిన పనిలేకుండా, .. చక్కగా, స్వేచ్ఛగా, సుదీర్ఘంగా రాసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఈనెల 19 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. వాస్తవానికి ఈ విషయాన్ని మేలోనే ప్రకటించిన ట్విట్టర్ 19వ తేదీనుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్విట్టర్ తాజా ప్రకటన యూజర్లలో సంతోషాలు నింపింది. 140 కేరెక్టర్ల పరిమితిలో ఇక నుంచి ఫొటోలు, లింకులను లెక్కపెట్టడాన్ని ఆపివేస్తారు. దీంతో వినియోగదారులు మరింతగా టెక్ట్స్ రాసుకునే వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం లింకుకు 23 కేరెక్టర్లు, ఫొటోకు 24 కేరక్టర్ల చొప్పున వినియోగదారులు స్పేస్ ను నష్టపోతున్న సంగతి తెలిసిందే. అలాగే పోల్స్, వీడియోలు, జిఫ్స్ లపై ఉన్న పరిమితిని కూడా ఎత్తివేస్తున్నారు. కొత్త నిబంధనలు ఈనెల 19 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇవి కూడా చదవండి:పెంపుడు కుక్క ఇష్టం లేదన్నాడని ... పెళ్ళి రద్దు చేసుకున్న యువతి

ఇవి కూడా చదవండి:ప్రతీ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి తెలియకుండా దాచే సీక్రెట్స్!

English summary

Worlds Popular Top Social Networking site Twitter announced that it was going to lift ban on 140 character limit for a tweet. This new updates will come from 19th of this month and with this user can upload unlimited number of photos also.