ప్రమాదవశాత్తు  రెండు కార్లు దగ్ధం 

Two Cars Burned In Two Different Incidents

11:44 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Two Cars Burned In Two Different Incidents

తెలంగాణ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం ప్రమాదవశాత్తూ రెండు కార్లు దగ్ధమయ్యాయి. అందులో ఒకటి వరంగల్ లో .. రెండోది కరీంనగర్ లో... అయితే పెను ప్రమాదం తప్పింది. ఈ రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరగలేదు. వివరాలు పరిశీలిస్తే, వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌ సమీపంలో శనివారం ఉదయం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లో కారు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్నవారు మంటలను గమనించి కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి గురైన కారు వరంగల్‌ జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్‌దిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునే లోపే కారు పూర్తిగా కాలిపోయింది.
ఇక కరీంనగర్‌ జిల్లా గంగాధరలో ఓ డ్రైవింగ్‌ స్కూల్‌కు చెందిన కారు దగ్ధమైంది. నలుగురు యువకులు డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతుండగా కుటిక్యాల మైదానం వద్ద కారులో హఠాత్తుగా మంటలు వ్యాపించాయి. కారులోని బ్యాటరీ వద్ద మంటలు చెలరేగి క్షణాల్లో కారు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.

English summary

Two cars burned in two different incidents in Telangana state.One was occured in Warangal and another was occured in Karimnagar. No one was died in this a two incidents