ఇద్దరి ప్రాణాలు తీసిన కుక్క .(వీడియో)

Two Died In Dog Attack

12:46 PM ON 10th June, 2016 By Mirchi Vilas

Two Died In Dog Attack

ఈ మధ్య వీధి కుక్కలే కాదు పెంపుడు కుక్కలు కూడా మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి. తాజాగా ఓ కుక్క దాడి నుంచి తప్పించుకోబోయి ఇద్దరు వర్కర్లు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నంలో జరిగిన ఇదో దారుణం. వివరాల్లోకి వెళ్తే, విశాఖ లలితానగర్ లో నాలుగో అంతస్తులో నివసిస్తున్న రాంబాబు అనే వ్యక్తి థర్డ్ ఫ్లోర్ లో పాలిషింగ్ పనులు చేయిస్తున్నాడు. గోపి, హుసేన్ వలి, శ్రీనివాస్ అనే వర్కర్లతో బాటు మరో ఇద్దరు ఈ పనుల్లో నిమగ్నమై ఉండగా..రాంబాబు పెంపుడు కుక్క గొలుసు తెంపుకుని వీరి వైపు దూసుకువచ్చింది. దీంతో భయపడిన వీరు మూడో అంతస్తు నుంచి కిందకు దూకారు.

ఈ ఘటనలో గోపి, హుసేన్ వలి మరణించగా శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. మృతుల కుటుంబాలకు రాంబాబు పరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేసారు. ఏది ఏమైనా పోయిన ప్రాణాలు తిరిగిరావు కదా.

ఇవి కూడా చదవండి:పుట్టింటోళ్ళూ తరిమేశారు..

ఇవి కూడా చదవండి:కేటీఆర్ కి షాకిచ్చిన ఏపీ విద్యార్థి

English summary

Two People were died in the attack of Dog in Lalitha Nagar in Vishakapatnam. Dog break down it's chain and dog used come fastly to attack them and then they jumped from the third floor.