ఇద్దరి డైరెక్టర్లతో తెరకెక్కుతున్న 'బాహుబలి-2'

Two directors were directing Baahubali 2

05:54 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Two directors were directing Baahubali 2

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి. 'బాహుబలి' చిత్రంతో రికార్డులు సృష్టించిన రాజమౌళి ఇప్పుడు 'బాహుబలి-2' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి మరో దర్శకుడు కూడా పని చేస్తున్నాడట. ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వచ్చేదాం ఇంతకీ ఈ చిత్రానికి మరో దర్శకునిగా పని చేసేదెవరో కాదు రాజమౌళి ముద్దుల తనయుడు కార్తికేయ. 'బాహుబలి' చిత్రం అంతర్జాతీయంగా పాపులర్‌ అవ్వడానికి రాజమౌళి ఎంత కష్టపడ్డాడో రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా అంతే కష్ట పడ్డాడు.

సోషల్‌ మీడియాతో పాటు, కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ మరియు ఇతర దేశాల ఫిలిం ఫెస్టివల్స్‌లో బాహుబలిని ప్రదర్శింపజేశాడు కార్తికేయ. ఇప్పుడు 'బాహుబలి-2' కి కూడా కార్తికేయ అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాడట. 'భాహుబలి-2' లో వచ్చే కొన్ని ముఖ్యసన్నివేశాల్ని కార్తికేయే చిత్రీకరిస్తున్నాడట. మొత్తానికి కార్తికేయ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

English summary

Two directors were directing Baahubali 2 movie. One was S.S. Rajamouli and another was Rajamouli grand son Karthikeya.