ఫోబ్స్  జాబితాలో ఎన్‌ఆర్‌ఐలు 

Two Indian-origin businessmen have been ranked by Forbes magazine among the richest entrepreneurs in America under the age of 40

07:13 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Two Indian-origin businessmen have been ranked by Forbes magazine among the richest entrepreneurs in America under the age of 40

భారత సంతికి చెందిన ఇద్దరు యువ వ్యాపారవేత్తలు ఫోబ్స్ జాబితాలో స్థానం లభించింది. ఫోబ్స్ విడుదల చేసిన 40 ఏళ్ళ లోపు వ్యాపారవేత్తల జాబితాలో ఫేస్‌బుక్‌ సిఈవో జూకర్‌బెర్గ్ మొదటి స్థానంలో ఉన్నాడు.

మాజి హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ వివేక రామస్వామి.(30 సంవత్సరాలు) 500 మిలియన్ల డాలర్ల నికర విలువతో ఈ జాబితా లో 33 వస్థానాన్ని సంపాదించుకున్నాడు.
మరో ప్రవాసబారతీయుడైన 29 సంవత్సరాల అపూర్వమెహతా 40 వస్థానాన్ని దక్కించుకున్నాడు. మెహతా స్థాపించిన ఇస్టాకార్డ్‌ 400 మిలియన్‌ డాలర్ల విలువ కలిగివుంది.

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు జూకర్‌బెర్గ్ 47.1 బిలియన్ల డాలర్ల విలువతో అగ్రస్థానంలో ఉన్నారు.జూకర్‌బెర్గ్ కాలేజి స్నేహితుడు మరియు సహావ్యవస్థాపకుడైన డస్టిన్‌ మస్కోవిజ్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్‌ వినియోగదారులు కలిగిన మెసేజింగ్‌ సర్వీస్‌ వాట్సాప్‌ వ్యవస్థాపకుడు జాన్‌కోమ్‌ మూడో స్థానంలో ఉన్నాడు. 2014 లో వాట్సాప్‌ ను 22 బిలియన్‌ డాలర్లకు ఫేస్‌బుక్‌ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

వర్చువల్‌ రియాల్టీ పరికరాల సంస్థ పామర్‌ లక్కి 21 సంవత్సరాలతో ఈ జాబితాలో స్థానం సంపాదించిన పిన్న వయస్కుడిగా ఉన్నాడు.

అమెరికాలో ప్రముఖ రక్త పరీక్ష కంపెని అయిన తిరనోస్‌ వ్యవస్థాపకురాలు ఎలిజబెత్‌ హోమ్స్‌ ఈ జాబితాలో ఎన్నికైన ఏకైక మహిళ కావడం విశేషం.

English summary

Vivek Ramaswamy, 30, a former hedge fund manager, has been ranked 33rd on the list with a net worth of $500 million. Forbes said his source of wealth is investments. On the 40th spot is 29-year old Apoorva Mehta, the founder and CEO of Instacart, the web-based grocery delivery service. Mehta's net worth is $400 million.