ఇంతకీ ఆమె ఎవరి భార్య ..

Two Men Claims That Woman Was Their Wife In Dhanbad

11:24 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Two Men Claims That Woman Was Their Wife In Dhanbad

ఒక రాధ ... ఇద్దరు కృష్ణులు సినిమా కాదు ఇది ... ఓ భార్య .. కానీ ఇద్దరు వ్యక్తులు .. ఇదో వింత ఘటన ... . ఒక మహిళను తన భార్యంటే, తన భార్యంటూ ఇద్దరు వ్యక్తులు పోలీసు స్టేషన్‌ మెట్లెక్కారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే, పింకీ దేవి అనే మహిళ తన భార్యేనంటూ లాల్తూ బోస్‌, సునీల్‌ శావ్‌ వాగ్యుద్ధానికి దిగడంతో పెద్ద డ్రామానే నడిచింది.

సూపర్ స్టార్ కూతురు డాన్స్ అదిరింది

వాస్తవానికి లాల్తూ బోస్‌, పింకీదేవి కలిసి సునీల్‌ను పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లారు. తన భార్య అయిన పింకీని అతడి భార్యగా చెప్పుకొంటున్నాడంటూ సునీల్‌పై బోస్‌ ఫిర్యాదు చేశాడు. అలాగే సునీల్‌ ఎవరో తనకు తెలియదని, చుట్టుపక్కల వారందరికీ తనను అతడి భార్యగా చెప్పుకొంటున్నాడని పింకీ కూడా తెలిపింది. అయితే, తాను చెబుతున్నది అక్షర సత్యమని సునీల్‌ వాదిస్తున్నాడు. పింకీ తన భార్యేనని, చూపు దెబ్బతినడంతో తన ఖర్మానికి తనను వదిలేసి, ఇంట్లోని రేషన్‌ కార్డు సహా ఉన్నవన్నీ ఊడ్చుకుపోయిందని చెప్పాడు. తమ కాపురానికి సాక్ష్యంగా ఒక బిడ్డ కూడా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇద్దర్ని పెళ్లాడి వదిలేసి, ఇప్పుడు లాల్తూతో ఉంటోందని చెబుతున్నాడు. వీరి కథనాలు విన్న పోలీసులకు బుర్ర తిరిగిపోగా, ‘మీ వాదనలను నిరూపించే చట్టపరమైన ఆధారాలతో రండి’ ఆ ముగ్గుర్నీ ఆదేశించారు. ఒకే పోలికలతో ఇద్దరు మహిళలు వున్నారా? ఒకే మహిళా డబుల్ రోలా? లేదా ఆ ఇద్దరు వ్యక్తులు ఆమె జీవితంతో ఆడుకుంటున్నారా ? ఇది నిజంగా వింత ఘటనే ...

వివాదంలో ఇరుకున్న బిగ్ బి - కేసు నమోదు

హిందీ సాంగ్ ని కాపీ కొట్టిన దేవిశ్రీ

కావాలనే రోజాను జగన్ ఇరికించాడా...

ఆయనకి భయపడి 'బ్రహ్మోత్సవం' వాయిదా వేసిన మహేష్

English summary

Two men named Sunil and Laaltu Bose claimed a single woman named Pinky Devi as their wife and they to went to police station and filed case on each other. This incident was occurred in Dhanbad.Police were confused and suggested them to come with certain proofs.