హత్య  చేసారు -   చెట్టుకు వేలాడ గట్టారు

Two Men Killed And Hanged to Tree Jharkhand

06:27 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Two Men Killed And Hanged to Tree Jharkhand

హత్యలు, దోపిడీలు విచ్చల విడిగా పెరిగిపోతున్నాయి. అక్కడా , ఇక్కడా అనే తేడాలేకుండా నిర్దాక్షిణ్యంగా చంపేసే పరిణామాలు రాజ్యమేలుతున్నాయి. తాజాగా తమ పశువులతో జంతువుల ప్రదర్శనకు వెళ్లిన ఇద్దరు వ్యాపారులు చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని లతేహార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఎందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

జబ్బార్‌ గ్రామానికి చెందిన ఇద్దరు పశువుల వ్యాపారులు ప్రదర్శన నిమిత్తం శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. అయితే వారిద్దరూ గ్రామ శివారులోని ఓ చెట్టుకు వేలాడుతూ కన్పించడాన్ని స్థానికులు గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారు. గుర్తుతెలియని వ్యక్తులు వీరిని హత్య చేసి, అనంతరం చెట్టుకు వేలాడదీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఘటనపై గ్రామంలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులను పట్టుకోవాలంటూ మృతదేహాలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులపై గ్రామస్థులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. సదరు గ్రామంలో విషాదం అలుముకుంది.

English summary

The bodies of two cattle traders, one of whom is a teenager, were found hanging from a tree in Jhabbar village in Jharkhand’s Latehar district Friday morning. Police said their hands were tied and the bodies bore injury marks, indicating they were hanged after being beaten to death.