విశాఖ మన్యంలో ఎదురు కాల్పు లలో  ఇద్దరు మావోల మృతి 

Two Naksalites Died In Vishaka Agency

11:10 AM ON 11th December, 2015 By Mirchi Vilas

Two Naksalites Died In Vishaka Agency

రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో మావోల కదలికలు కనిపిస్తున్నాయి. విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరు మావోలు హతమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు ఆనవాళ్లు లేకుండా పోయినా మావోలు.. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్నారన్న వాదనకు బలం చేకూరుస్తూ ఈ మధ్యన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మధ్య పాస్టర్కుమారుడు కిడ్నాప్ , ఆతర్వాత విడుదల ఘటనలు విశాఖ మన్యం వైపు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.

మావోలు.. పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. ఈ ఘటనలో పోలీసులు గాయపడినట్లుగా చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న కూంబింగ్ సందర్భంలో మావోలు ఎదురుకావటం.. ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలైనట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా అరకు మండలం గన్నిల అటవీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో మావోల జాడలు కనిపించినా.. ఎన్ కౌంటర్ లాంటి భారీ ఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో.. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. తెల్లవారుజామున మొదలైన కాల్పులు.చాలాసేపు కొనసాగాయి. .దీంతో మన్యంలోని తండా ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు.

English summary

Two naksalites died in an encounter that occured in vishaka agency this early morning