బ్లూ నుంచి రెండు వివో సిరీస్ ఫోన్లు

Two New Smart Phones From Blu

04:24 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Two New Smart Phones From Blu

అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ బ్లూ 'వివో' సిరీస్ లో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. వివో 5, వివో ఎక్స్‌ఎల్‌ పేరిట వీటిని రిలీజ్ చేసింది. అమెరికాలో జరుగుతున్న సీఈఎస్-2016లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. ఈ రెండు ఫోన్లను ఇంతకు ముందు వచ్చిన వివో స్మార్ట్‌ఫోన్ల కన్నా తక్కువ ధరకే బ్లూ అందిస్తోంది. వివో 5 ధర రూ.13,250. వివో ఎక్స్‌ఎల్ ధర రూ.10 వేలు. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని స్టోర్స్‌తోపాటు అక్కడి వినియోగదారులకు అమెజాన్ సైట్ ద్వారా ఇవి లభిస్తున్నాయి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.

వివో 5 ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720*1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, మార్ష్‌మాలోకు అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటు, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్, 3150 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో ఎక్స్‌ఎల్ ఫీచర్లు ఏమిటంటే..

5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720*1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, మార్ష్‌మాలోకు అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటు, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 4జీ, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్, 3150 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary

US-based smartphone maker, has unveiled two new Android smartphones, the Vivo 5 and Vivo XL, at the ongoing CES 2016 trade-show in Las Vegas.