ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఖరారు 

Two New Teams In IPL

06:24 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Two New Teams In IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రెండు కొత్త జట్లు చేరాయి. దిల్లీలో నిర్వహించిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో రాజ్‌కోట్, పుణె జట్లకు అవకాశం కల్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఐపీఎల్ నుంచి వేటుకు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ స్థానంలో ఈ జట్లకు చోటు దక్కింది.

2013 ఐపీఎల్ మ్యాచ్ సమయంలో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు బెట్టింగ్‌కు పాల్పడ్డారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బుకీలతో సంప్రదింపులు జరిపినట్లు కూడా ఈ జట్లపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఈ రెండు జట్లను ఐపీఎల్ నుంచి రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది. దీంతో వీటి స్థానంలో నూతన జట్ల కోసం ఐపీఎల్ పాలక మండలి బిడ్డింగ్ నిర్వహించింది. ఇందులో రాజ్‌కోట్, పుణె జట్టులు ఖరారయ్యాయి. పుణె జట్టును కోల్‌కతాకు చెందిన ప్రముఖ వ్యాపారి సంజీవ్ గోయెంకా రూ. 16కోట్లు, రాజ్‌కోట్ జట్టును మొబైల్ తయారీ సంస్థ ఇంటెక్స్ రూ. 10కోట్లకు బిడ్ ద్వారా దక్కించుకున్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్

వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దిల్లీలో ఈరోజు జరిగిన ఐపీఎల్ పాలకమండలిసమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 6న బెంగళూరులో ఐపీఎల్ వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు.

English summary

Two new teams for the next ipl season. Chennai and Rajasthan Teams Were ruled out of the tournament for some illegal activirties