హువాయ్‌ నుంచి హానర్ 5 ఎక్స్, హానర్ హోలీ2 ప్లస్

Two News Smartphones From Huawei

10:21 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Two News Smartphones From Huawei

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ హువాయ్‌ భారత మార్కెట్లోకి కొత్తగా రెండు స్మార్ట్‌ ఫోన్లను రిలీజ్ చేసింది. హానర్‌ 5ఎక్స్‌, హానర్‌ హోలీ 2 ప్లస్‌ పేర్లతో వీటిని విడుదల చేసింది. 5ఎక్స్‌ 2 జీబీ వేరియంట్‌ ధర రూ.12,999 కాగా, హోలీ 2ప్లస్‌ ధర రూ.8,499. భారత్‌లో ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ ఇండియాల ద్వారా ఈ ఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ వెబ్‌సైట్లలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5ఎక్స్‌ ప్రీ బుకింగ్‌లు ప్రారంభం అవుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి షిప్పింగ్‌ మొదలవనుంది. హోలీ 2 ప్లస్‌ ఫిబ్రవరి 15 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

హానర్‌ 5ఎక్స్‌ ఫీచర్లు ఇవే

5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ తాకే తెర, 1080×1920 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం, డ్యూయల్‌ సిమ్‌, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 16జీబీ అంతర్గత మెమొరీ, ఎస్‌డీ కార్డుతో 128జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం, 13 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 64 బిట్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ, క్విక్ చార్జ్ 3.0

హానర్‌ హోలీ 2ప్లస్‌ ఫీచర్లు

5 అంగుళాల హెచ్ డీ తాకే డిస్‌ప్లే, 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టం, 2జీబీ ర్యామ్‌, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 13 మెగాపిక్సల్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 16 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్‌డీ కార్డుతో మెమొరీని 128జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 64 బిట్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్

English summary

Worlds famous mobile company Huawei launched two new android smartphones named Honor 5X, Honor Holly 2 Plus in India.The price of these smartphones was Honor 5X Rs. 12,999 and Honor Holly 2 Plus price was Rs. 8,499.These two smartphones was available on E-commerce websites Flipkart and Amazon