ఒకడు బాత్రూమ్ లో.. మరొకడు ఫేస్బుక్ లో

Two Nirbhaya Cases Filed In BanjaraHills Police Station

01:23 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Two Nirbhaya Cases Filed In BanjaraHills Police Station

ఇదేమిటి అనుకుంటున్నారా? ఒక రాధ ఇద్దరు కృష్ణుల సినిమా కూడా కాదు ... పైశాచిక చేష్టలకు ఇది పరాకాష్ట ... వివరాల్లోకి, అసెంబ్లీ రౌడీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో గానీ ఒకడు బాత్ రూమ్ లోని వాటర్ డ్రమ్ములో దూరాడు. మరో ప్రభుద్ధుడు ఫేస్ బుక్ లో యువతి పట్ల అసభ్య ప్రకటనలు చేశాడు. ఈ రెండు ఘటనలూ ఒకే రోజు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నాయి. బాధితురాళ్ల ఫిర్యాదుల మేరకు బంజారాహిల్స్ పిఎస్ లో రెండు నిర్భయ కేసులు నమోదు చేసారు. ఇందుకు సంబంధించి, . వివరాల్లోకి వెళ్తే, ఫిలిం నగర్ లోని గౌతమ్ నగర్ కు చెందిన ఓ యువతి, స్నానం చేసేందుకు బాత్ రూమ్ లోకి వెళ్లింది. అప్పటికే బాత్ రూమ్ లోకి దూరి నీళ్ల డ్రమ్ములో దాక్కున్న స్థానికంగా కిరాణాషాపు నిర్వహించే యువకుడు, ఆమె లోనికి రాగానే అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో కేకలు వేస్తూ బయటికి పరుగు తీసిన యువతి ఫ్యామిలీ మెంబర్స్ సాయంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది.

ఇవి కుడా చదవండి :

శృంగార కథానాయికలు అసలు ఎన్నిరకాలో తెలుసా?

ఏప్రిల్ ఫూల్‌ చేయండిలా

కాగా మరో ఘటనలో నల్లగొండ జిల్లా మోత్కూరు ప్రాంతానికి చెందిన ఓ యువతి బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని షౌకత్‌నగర్‌లో తన సోదరుడి ఇంట్లో ఉంటూ సమీపంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తోంది. షాద్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ అనే పరిచయమున్న యువకుడు ఆమె ఫొటోలు ఫేస్‌బుక్‌లో ఫొటో పెట్టి 'ఈమె క్యారెక్టర్ మంచిదికాదు' అని రాయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మొత్తానికి ఈ రెండు కేసుల్లో బాధితుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుకి సిద్దం అయ్యారు.

ఇవి కుడా చదవండి :

నేతాజీ చనిపోలేదని నిరూపిస్తున్న రేడియో ప్రసంగం

క్రికెటర్స్ ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

English summary

Two Nirbhaya Cases filed on One day in Hyderabad Banjara Hills Police Station. One man hidden in a drum in Bathroom and misbehaved with that girl and another guy who belongs to same area post one of her friends photos in facebook by saying that her character was not good. The both girls complained on Banjara Hills police Station and Banjara Hills Police filed Nirbhaya Case on the two guys and they taken them into custody.