తల్లీ బిడ్డను మింగేసిన వాషింగ్ మెషిన్

Two People Died By Electric Shock In Hyderabad

10:13 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Two People Died By Electric Shock In Hyderabad

ఇదేమిటి వాషింగ్ మిషన్ మింగేయ డమేమిటని అనుకుంటున్నారా ? అవును తల్లీ బిడ్డలు బలయ్యారు. అత్యంత కర విషాదకర ఘటన ఇది. ఎందుకంటే, ఇళ్లలో వాషింగ్ మిషన్ కంపల్సరీ అయిపోయిన రోజులివి. రోజుకో రెండురోజులకో వాషింగ్ మిషన్ ఆన్ చేయాల్సిందే. వాషింగ్ మిషన్ పనితీరును చిన్నారులు ఎంతో ఆసక్తిగా పరీక్షిస్తుంటారు. దగ్గరకెళ్లి తాకుతుంటారు. ఇలాంటి సందర్భంలోనే ఘోర విషాదం జరిగిపోయింది. సికింద్రాబాద్‌ వారసిగూడలో విద్యుత్‌షాక్‌ కు గురై రెండేళ్ల కుమారుడు సహా తల్లి మృతి చెందింది. వాషింగ్‌మెషిన్‌ నుంచి బట్టలు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారిని ఆసుపత్రికి తరలించే అవకాశం లేకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. పలువురిని కలచి వేసింది.

ఇవి కూడా చదవండి:

కలిసి నటిస్తున్న తండ్రికొడుకుల

దాడి చేసారు సిసి కెమెరాకు దొరికిపోయారు (వీడియో)

భర్త రెచ్చిపొమ్మన్నాడు... ఇక అందాలు ఆరబోస్తా...

English summary

A Woman and her child died due an electric shock occurred from a washing machine. This incident was occurred in Secunderabad.