ఏరికోరిన జల్లికట్టు ఇద్దరి ప్రాణం తీసేసింది

Two people died in Jallikattu

11:28 AM ON 23rd January, 2017 By Mirchi Vilas

Two people died in Jallikattu

ప్రతియేటా సంక్రాంతికి తమిళ తంబీలు జల్లికట్టు ఆడతారు. అయితే ఈ ఆటపై ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తు న్నా , చివరిక్షణంలో కొనసాగుతూనే ఉండడం చూస్తూనే వున్నాం. ఈ ఏడాది అయితే పార్టీలు , వర్గాలకతీతంగా అందరూ జల్లికట్టుకోసం ఉద్యమించి ఎట్టకేలకు నిషేధం తొలగించేలా చేసుకున్నారు. దీంతో ఆదివారం లాంఛనంగా జల్లికట్టు సాగింది. ఇందులో భాగంగా తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో నిర్వహించిన జల్లికట్టులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా దాదాపు 57మంది గాయపడ్డారు. జిల్లాలోని రాపూసాల్ గ్రామంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య జల్లికట్టును నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు(30), మోహన్ (30)లు ప్రాణాలు కోల్పోయారు. పోటీల సందర్భంగా తీవ్రంగా గాయపడిన వీరిని పుదుకొట్టై, ఇలుపూర్ ఆసుపత్రుల్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇక్కడ జల్లికట్టును రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్ ప్రారంభించారు. ఆయన సమక్షంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం విశేషం. దాదాపు 150 ఎద్దులు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఈ పోటీలను చూసేందుకు వేలసంఖ్యలో ప్రజలు ఎగబడ్డారు. మొత్తానికి ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఇది కూడా చూడండి : ఓ నిమిషంలోనే నో స్టాక్ ... నోకియా ఆండ్రాయిడ్ సంచలనం

ఇది కూడా చూడండి : అందరికీ షాకిస్తూ .. జియో ఆఫర్ మళ్లీ పొడిగింపు!

English summary

Tamilnadu people happily participated in Jallikattu with the inauguration health minister but an sorrow thing happened on sunday two people died in this traditional play