ఇద్దరు చంద్రుల మధ్య క్రిష్ మ్యారేజ్!

Two telugu states CM's coming to Krish marriage

05:41 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Two telugu states CM's coming to Krish marriage

ఇదేమిటని ఆశ్చర్యపోవద్దు. నిజం.. నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెల్సిందే. విభిన్నకథాంశాలతో చిత్రాలను తెరకెక్కించే క్రిష్.. తన వివాహ వేడుకలను కూడా విభిన్నంగానే నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే తన పెళ్లిపత్రికను అందరూ ఆశ్చర్యపోయేలా అద్భుతంగా రూపొందించి, అందరూ తన పెళ్లి గురించి మాట్లాడుకునేలా చేశాడు. పెళ్లి ఏర్పాట్లే ఇంత విభిన్నంగా ఉంటే.. పెళ్లి మరెంత విభిన్నంగా ఉంటుందోననే ఆసక్తి కల్గించాడు.. ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల్లోని హేమాహేమీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటీవల జాతీయ అవార్డు గెలుచుకున్న క్రిష్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. ఈ చొరవతో చంద్రబాబును క్రిష్ తన పెళ్లికి ఆహ్వానించవచ్చు. దీంతోపాటు బాలయ్య 100వ చిత్రాన్ని రూపొందించడం, బాలకృష్ణ, చంద్రబాబు వియ్యంకులు కావడంతో పెళ్లి పిలుపులకు ప్రాధాన్యత ఏర్పడింది. క్రిష్ పెళ్లి హైదరాబాద్ లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఆహ్వానించే అవకాశాలున్నాయి. సో... క్రిష్ పెళ్లికి ఇద్దరు చంద్రులు కలుసుకునే అద్భుతం జరిగే అవకాశం ఉందని చెప్పకనే చెప్పవచ్చు.

రెండు రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన తరువాత కేవలం రెండేరెండు సార్లు కలుసుకున్న ఈ చంద్రులు క్రిష్ పెళ్లిలో కలుసుకుంటే మరో అద్భుతం జరిగినట్లే అవుతుందని అంటున్నారు. అన్నీ బానే వున్నాయి గానీ ఇంతకీ మరి క్రిష్.. తన పెళ్లికి ఈ చంద్రులను పిలుస్తాడో లేదో తెలియాలి కదా. అదికూడా కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. అయితే, ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్ల నుంచి కొంచెం విరామం తీసుకున్న క్రిష్. ఈలోగా, గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రారంభించాడని అంటున్నారు.

English summary

Two telugu states CM's coming to Krish marriage