బోరు బావిలో పడి బాలిక మృతి

Two Year Old Baby Fell In Bore Well

09:35 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Two Year Old Baby Fell In Bore Well

తెలంగాణాలో తరచూ బోరు బావిలో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న్నారు. తాజాగా నల్గొండ జిల్లా షాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల గ్రామ శివారులోని నిమ్మ తోటలో బోరు గుంతలో పడి, శాన్వి(2) అనే చిన్నారి మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం శాన్వి తల్లిదండ్రులు నిమ్మతోటలో పనికి వెళ్లారు. వారితో పాటు చిన్నారిని తీసుకెళ్లారు. తల్లిదండ్రులు పని చేస్తుండగా చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయింది. దీంతో అప్రత్తమైన జిల్లా యంత్రాంగం పాపను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టింది. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు చిన్నారిని బయటకు తీశారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు రోదించారు.

English summary

A two year old baby name Shanwi fells in bore well and died in that borewell.THis incident was occured in Showraaram in Nalgonda District,Telangana.Rescue team tried to save her but she died before they taken baby from the bore well