వావ్ .. ప్రమాదంలో ఉన్న సోదరుడిని కాపాడేందుకు ఈ బుడతడు ఏం చేసాడంటే,

Two Year Old Twin Saves His Brother From Fallen Dresser

10:33 AM ON 5th January, 2017 By Mirchi Vilas

Two Year Old Twin Saves His Brother From Fallen Dresser

పెద్ద పెద్ద ఇళ్లల్లో ఎవరి గదులు వారికుంటాయి. ఎవరి గదిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి నెలకుంటుందని అంటారు. కానీ ఇక్కడ సీను చూస్తే, పిల్లల రూమ్ లో ప్రమాదం జరిగినా తల్లి దండ్రులకు తెలియలేదు. డ్రెస్సర్ కింద చిక్కుకుపోయిన తన కవల సోదరుడిని రక్షించి రెండేళ్ల బుడతడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అబ్బురపరిచే ఈ ఘటన అమెరికాలోని యూటాలో చోటు చేసుకుంది.

బ్రోక్ , బౌడీషోఫ్ ఇద్దరూ కవల సోదరులు. వారిరువురు గదిలో ఆడుకుంటున్న సమయంలో డ్రెస్సర్ పైకి ఎక్కే ప్రయత్రం చేయగా, అది బ్రోక్ మీద పడిపోయింది. దీంతో అతడు దానికింద చిక్కుకుపోయాడు. బాధతో విలవిల్లాడుతున్న బ్రోక్ ను చూసిన బౌడీషోఫ్ ... సోదరుడిని ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. ఏం చేయాలో చాలాసేపు తికమక పడి సోదరుడిని రక్షించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. చివరకు 52 కిలోల బరువున్న డ్రెస్సర్ ను పక్కకు నెట్టి తన సోదరుడిని కాపాడుకోగలిగాడు. ఇంత జరిగినా ఇంట్లోనే ఉన్న తల్లిదండ్రులకు ఈ విషయం తెలియలేదు. గదిలో ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాన్ని చూసి తాను ఆశ్యర్యానికి, బాధకు గురయ్యానని చిన్నారుల తల్లి హెలీఫ్ షోఫ్ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి: ఏడాది పాటు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

ఇవి కూడా చదవండి: ఆ నటి డ్రెస్ ధర ఎంత పలికిందో తెలిస్తే షాకవ్వాల్సిందే

English summary

Now a video in internet going viral that a two year old twin boys were playing in the house and they reached the dresser and suddenly the dresser fall on the twin brothers and one of the boy saved his brother from that fallen dresser.