ఫిలిప్పీన్స్ ను వణికిస్తున్న టైఫూన్‌

Typhoon hits Philippines

05:25 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Typhoon hits Philippines

అత్యంత శక్తిమంతమైన మెలర్‌ టైపూన్‌ ఫిలిప్పీన్స్‌ ను వణికిస్తోంది. సముద్ర తీరంలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడటం, వరదలు, చెట్లు కూలడం, కొండ చరియలు విరిగి పడటంలాంటి ప్రమాదాలు పొంచి ఉండటంతో మధ్య ఫిలిప్సీన్స్‌ దీవుల నుంచి దాదాపుగా ఏడున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మెలర్‌ ప్రభావం ఇప్పటికే సమర్‌ ప్రాంతంపై పడిందని అక్కడి వాతావరణ విభాగం వెల్లడించింది. సోమవారం ఉదయం అక్కడ గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ గాలుల వల్ల ఇళ్ల కప్పులు ఎగిరిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నాలుగు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయని చెప్పింది. ఒక్క ఆల్బే ప్రావిన్సు నుంచే ఆరు లక్షల మంది ప్రజల్ని ఖాళీ చేయించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించినట్లు వార్తలు అందలేదని పేర్కొంది.

English summary

Philippines typhoon with winds of up to 150km/h made landfall, dumping heavy rain that authorities have warned could cause flooding