బ్రహ్మోత్సవానికి సెన్సార్ ఒకే

U Certificate To Brahmotsavam Movie

09:48 AM ON 17th May, 2016 By Mirchi Vilas

U Certificate To Brahmotsavam Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ఈనెల 20న విడుదల కానున్న నేపధ్యంలో కీలకమైన సెన్సార్ వచ్చేసింది. ఎప్పటిలాగానే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన ప్రతిభను మరోసారి చూపించాడు. ఈసారి కూడా తన తీసిన సినిమా ఫ్యామిలీ విలువలకూ.. బంధుత్వాలకూ.. బాధ్యతలకూ సంబంధించన సినిమా అంటూ ప్రూవ్ చేసేశాడు. సెన్సార్ సర్టిఫికేటే అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి:ఓ రోజు ముందే ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు

సోమవారం ఉదయం బ్రహ్మోత్సవం సినిమా సెన్సార్ స్ర్కీనింగ్ నిర్వహించారు. సినిమాను చూసిన సెన్సార్ అధికారులు ఒక్కసారిగా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గుర్తుకు తెచ్చుకున్నారట. ఒక్క విజువల్ కాదు కదా.. ఒక్క పదం కూడా మ్యూట్ చేయమని చెప్పకుండా.. సినిమాకు క్లీన్ ''యు'' సర్టిఫికేట్ చేతిలో పెట్టేశారు. అంతే కాదు.. ఇప్పటికే అమెరికా పంపించాల్సిన హార్డు డిస్క్ కాపీలను కూడా సిద్దం చేస్తున్నారట. మంగళవారం ఉదయం ఫ్లయిట్ కు దాదాపు హార్డు డిస్కులు పంపేసే ఛాన్సుంటుంది. సో.. ఎక్కడా కూడా ప్రీమియర్ల నుండి బెనిఫిట్ షోల ను మిస్సయ్యే ఛాన్సే లేదని అంటున్నారు. ఇక బ్రహ్మోత్సవం పండగే పండగ ... ఇంకేముంది.. మరి 20న బ్రహ్మోత్సవం పండుగకు సిద్దమవ్వండి.

ఇవి కూడా చదవండి:'బ్రహ్మోత్సవం' స్పెషల్ షోకి పర్మిషన్

English summary

Tollywood Super Star Mahesh Babu's recent flick was Brahmotsavam and this movie was going to release on May 20th which was directed by family movie special director Srikanth Addala. Censor Board Gives clean "U" certificate to Brahmotsavam movie and Censor Officials Praised this movie also. One interesting fact that there were no single cut or mute for the movie.