సైజ్‌ జీరోకి 'యూ/ఎ' సర్టిఫికేట్‌!

U/A certificate for size zero

07:18 PM ON 20th November, 2015 By Mirchi Vilas

U/A certificate for size zero

బాహుబలి, రుద్రమదేవి తరువాత అనుష్క నటించిన తాజా చిత్రం 'సైజ్‌ జీరో'. ఈ చిత్ర కధానుసారం 20 కేజీలు బరువు పెరిగి అనుష్క అందరిని షాక్‌కి గురి చేసింది. ఈ చిత్రంలో అంత బొద్దుగా కనిపిస్తుంది మరి. అనుష్కని గ్లామరస్‌గా, రుద్రమదేవిగా చూసిన ప్రేక్షకులు ఈసారి ఒక డిఫరెంట్‌ లుక్‌తో చూడబోతున్నారు. ఇందులో అనుష్క పాత్ర నవ్వులు పువ్వులు పూయిస్తుందని చెప్తున్నారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించగా ఆయన సతీమణి కణిక ధిల్లాన్ కోవెలమూడి కథ, స్క్రీన్‌ప్లే అందించారు.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 27న అంగరంగ వైభవంగా విడుదల చేస్తున్నారు. తమిళంలో 'ఇంజి ఇడుపళగి' అనే పేరుతో రిలీజ్ అవుతుంది. తెలుగులో రెండు రాష్ట్రాలతో పాటు, కేరళ, కర్ణాటక, నార్త్‌ ఇండియా, యు.ఎస్‌.ఎ, మలేసియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, యూరప్‌, ఆఫ్రికా, సింగపూర్‌, శ్రీలంక, యూ.కె. గల్ఫ్‌ల్లో మాత్రం 'సైజ్‌ జీరో' పేరుతో విడుదలవుతుంది. ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్‌ వాళ్లు యూ/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చింది. సైజ్‌ జీరో ప్రధాన తారాగణం అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్‌చౌహాన్‌, ప్రకాష్‌రాజ్‌, గొల్లపూడి మారుతీరావు, పోసాని కృష్ణమురళి మరియు అడవిశేష్‌. ఈ చిత్రానికి సంగీతం యం.యం. కీరవాణి, కథ, స్క్రీన్‌ప్లే - కణిక ధిల్లాన్ కోవెలమూడి, నిర్మాతలు : పరమ్‌ వీ.పొట్లూరి, కవిన్‌ అన్నే, దర్శకత్వం ప్రకాష్‌ కోవెలమూడి.

English summary

U/A certificate for size zero