శంకరాభరణంకు యూ/ఎ సర్టిఫికేట్

U/A certificte for Nikhil's new movie sankhara bharanam

06:27 PM ON 13th November, 2015 By Mirchi Vilas

U/A certificte for Nikhil's new movie sankhara bharanam

స్వామి రారా, కార్తికేయ, సూర్య vs సూర్య చిత్రాల తరువాత మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నాడు. ఇతను నటించిన తాజా చిత్రం శంకరాభరణం. ప్రేమ కథా చిత్రం,లవర్స్ చిత్రాల ఫేమ్ నందిత ఇందులో కథానాయకగా నటించింది. దీనికి సమర్పకుడు ప్రముఖ కథా రచయిత కోన వెంకట్. "గీతాంజలి" నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉదయ్ నందనవనం దర్శకుడు.

నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ బోర్డ్ యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది, ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేస్తున్నామని చెప్పారు. చిత్ర సమర్పకుడు, కథా రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ ఇది ఒక క్రైమ్ స్టోరీ.. ఇందులో హాస్యానికి పెద్ద పీట వేసి కథను మలిచాము. ఈ సంస్థలో ఇంతకు ముందు తీసిన గీతాంజలి ఘన విజయం సాధించింది, ఇది కూడా అలాగే ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాని అన్నారు. ఈ చిత్రానికి లొకేషన్స్ సెట్స్ వెయ్యలేదని టాకీ భాగం మాత్రమే కాకుండా పాటలు కూడా వివిధ లొకేషన్స్లో చిత్రీకరించామని చెప్పారు.

కథలోకి వస్తే: అమెరికాకి చెందిన అత్యంత ధనవంతుడు కొడుకు హీరొ నిఖిల్. ఈ లోకంలో కేవలం రెండే జాతులు ఉన్నాయన్నది హీరో నమ్మకం. అవి సుఖపడేవాళ్ళు మరియు కష్టపడేవాళ్ళు. అతను ధనవంతుడు అవ్వడం చేత తాను సుఖపడటానికే పుట్టానన్నది అతని భావన. హీరో ఒక ముఖ్యమైన పని మీద ఇండియాకి వస్తాడు. అక్కడకి వచ్చాక అతను చాలా కష్టాలు ఎదుర్కుంటాడు. వాటి నుండి హీరో ఎలా తప్పించుకున్నాడన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని చెప్పారు.

ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ నటీనటులు నటించారు . ఇందులో మరొక ముఖ్యపాత్ర హీరోయిన్ అంజలి చేసింది, కథ నచ్చడంతో ఆమె వెంటనే ఈ పాత్ర చెయ్యడానికి ఒప్పుకున్నారని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ లక్కరాజు, కెమెరా సాయిశ్రీరామ్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు కోన వెంకట్.

English summary

U/A certificte for Nikhil's new movie sankhara bharanam, after the hatrick hits of nikhil he is now ready with different story sankhara bharanam