ఆమె చదివింది పదే.. కానీ నెలకు 2 లక్షలు సంపాదిస్తుంది. ఎలాగో తెలుసా

Uber Nandini earning 2 lakhs for month

03:48 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Uber Nandini earning 2 lakhs for month

ఒకప్పుడు బ్రతకడం కోసం డబ్బు సంపాదించేవాళ్ళం, కానీ ఇప్పుడు డబ్బు సంపాదించడం కోసమే బ్రతుకుతున్నాం.. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు లేకపోతే మనిషి లేడు అన్నట్లు ప్రస్తుత లోకం తయ్యారయింది. అసలు డబ్బు లేకపోతే మనం పెంచే కుక్క పిల్ల కూడా మన మాట వినదు అనేది ప్రస్తుత సామెత.. డబ్బు లేకపోతే ఇంట్లో నుండి కాలు బయట పెట్టలేం.. అసలు ఏం చెయ్యాలన్నా డబ్బే కావాలి, అదుంటే కొండ మీద కోతినైనా దించొచ్చు... అయితే 33 ఏళ్ల నందిని కూడా డబ్బే సమస్య అయింది.. గత ఏడాది వరకు రెండు పూటలు భోజనం దొరికితే చాలనుకుంది. చిన్నప్పుడు పేదరికంలో మగ్గిపోయింది. డాక్టర్ కావాలని కలలు కనేది. అయితే డబ్బులు లేకపోవడంతో పదో తరగతిలోనే చదువును ఆపేయాల్సి వచ్చింది. అలాంటి నందిని జీవితాన్ని ఊబర్ కంపెనీ మార్చేసింది.

1/5 Pages

కుటుంబ బాధలు:


బెంగళూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో పెరిగింది నందిని. ఆమె తండ్రి చిన్న ఆలయంలో పూజారిగా పని చేసేవాడు. చాలీచాలని ఆదాయం. అందుకే పదో తరగతి తర్వాత స్కూల్ మాన్పించేసి పెళ్లి చేసేశారు. కొన్నాళ్లు గృహిణిగా ఉండిపోయింది. కానీ నందినికి సగటు ఇల్లాలిగా మిగిలిపోవడం ఇష్టం లేదు. ఏదో సాధించాలన్న తపన. భర్త శ్రీశాంత్ శాస్త్రి కూడా పూజారిగానే పని చేసేవారు. వచ్చిన ఆదాయం తిండికి మాత్రమే సరిపోయేది. అందుకే చిన్నాచితకా పనులు చేసి తనవంతుగా కుటుంబానికి ఎంతో కొంత ఇచ్చేది.

English summary

Uber Nandini earning 2 lakhs for month. Nandini stood 10th class but she is earning 2 lakhs per month in bangalore.